అరకు ను  జిల్లాగా ప్రకటించాలని తాహసిల్దార్ కు వినతి పత్రం

అరకువేలి ముచ్చట్లు:
 
మండల కేంద్రంలో గల తహసిల్దార్ కార్యాలయం బయట టిడిపి శ్రేణులు గిరిజన ఉద్యోగ జేఏసీ నాయకులు బిజెపి నాయకులు మండల తాహసిల్దార్ వేణుగోపాల్ రావు కు అరకు ను  జిల్లాగా ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు  ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సివేరి  దొన్నుదొర  మాట్లాడుతూ  ఇప్పుడున్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మొన్నటివరకు  అరకు ను జిల్లాగా  చెయ్యాలని చెప్పి ఇప్పుడేమో పాడేరు కు జిల్లా ప్రకటించడం పై  సర్వత్ర  విమర్శలు వెల్లువెత్తుతున్నాయని మండిపడ్డారు మాట మార్చాను మడమ తిప్పను అనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు అరకు ను జిల్లా కాదని పాడేరు ను  జిల్లాగా ప్రకటించడం  దీన్ని మాట మార్చడం మడమ తిప్పడం కాదా అని ప్రశ్నించారు  అరకు ను జిల్లా గా ప్రకటించకపోవడానికి  కారణం ఏమిటో చెప్పాలని అన్నారు స్థానిక శాసనసభ్యుడు  చెట్టి ఫాల్గుణ  పాడేరు ను  జిల్లాగా ప్రకటిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారో  మౌనం వీడి  ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు  ప్రపంచ  ప్రఖ్యాతి గాంచిన అరకు లోయను  జిల్లాగా ప్రకటించకపోవడం  అంతర్యం ఏమిటో చెప్పాలని అన్ని రకాలుగా పుష్కలంగా ఉండే అరకు ను జిల్లాగా కాదని పాడేరు ను జిల్లా గా  ప్రకటించడం ఈ రెండింటికి వ్యత్యాసం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పెదలబుడు సర్పంచ్ పీ.దాసుబాబు,బీబీ నాగేశ్వరరావు, టీడిపి మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, శెట్టి అప్పాలు, గిరిజన జేఏసీ నోగెలి అప్పన్న,భూర్జ లక్ష్మి, బీజేపీ నాయకులు ఆనంద్ రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
 
Tags: Petition to Tahasildar to declare Araku as a district

Natyam ad