త్వరలో పెట్రో మోత.

న్యూఢిల్లీ ముచ్చట్లు:
 
మూలిగే నక్కపై ముంజకాయ పడ్డట్టు అయ్యింది భారత్ పరిస్థితి. ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోల్(Petrol ) ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం సెగ భారత్‌ను తాకే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా పెట్రో రేట్ల సవరింపు లేదు గానీ.. తాజా పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఇంధన ధరలపై రివ్యూ జరిగితే లీటర్ పెట్రోల్ 150 నుంచి 180 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరింది. మరో నెలలో ఇది 140 డాలర్లకూ చేరొచ్చన్నది అంచనా. అంటే మన దగ్గర మార్చి 7న ఎన్నికలు కాగానే.. 8న కచ్చితంగా పెట్రోల్‌ ధరల రివ్యూ ఉంటుంది. అప్పటికి క్రూడ్ ఆయిల్ ధర మరింత పెరుగుతుంది. ఆ రోజుకు అంచనా లీటర్ పెట్రోల్ రూ.200లకు చేరినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదన్నది తాజా లెక్కలు చెబుతున్నాయి.చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్,  డీజిల్ ధరలను అప్‌డేట్ చేస్తుంటాయి.  మార్చి 2, 2022 బుధవారం కూడా జాతీయ మార్కెట్‌లో వాహన ఇంధనం పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. అయితే, రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత కారణంగా.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ఖరీదైనదిగా మారుతోంది. అమెరికాతో పాటు పలు దేశాల్లో పెట్రోల్ ధరలు పెరగడంతో.. ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. అయితే మూడు నెలలకు పైగా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఉత్తరప్రదేశ్‌తో సహా దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచవచ్చని తెలియజేద్దాం.
 
Tags:Petro size soon

Natyam ad