Pics

కాపు తుట్టెను కదిల్చిన జగన్

Date:02/08/2018
కాకినాడ ముచ్చట్లు:
వైసీపీ అధినేత జగన్ రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో తూర్పు గోదావరి జిల్లాలోని కాపు సామాజిక వర్గం కొంత శాంతించింది. జగన్ వ్యాఖ్యలు తమకు కలసి వస్తాయని అంచనా వేసిన తెలుగుదేశం పార్టీకి జగన్ కాపు రిజర్వేషన్లపై తాజా వివరణతో కొంత గందరగోళంలో పడింది. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉన్నాయని, తనకు సంబంధంలేని అంశంపై స్పష్టమైన హామీ ఇవ్వలేనని జగన్ చేసిన ప్రకటనను టీడీపీ అందిపుచ్చుకోవాలని చూసింది. తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ కూడా ఊహించలేదు.ఇంటలిజెన్స్ నివేదికలు కూడా జగన్ పాదయాత్ర సక్సెస్ అవుతుందని, బహిరంగ సభకు వేల సంఖ్యలోహాజరవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదికలు ఇచ్చింది. దీనికి తోడు కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీని వీడుతుండటం తెలుగుదేశం పార్టీని కలవరపెట్టింది. ఈదశలో జగన్ కాపు రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు తమకు ఉపయోగపడతాయని తెలుగుదేశం పార్టీ సంతోష పడింది. జగన్ వ్యాఖ్యలను చంద్రబాబు దగ్గర నుంచి కిందిస్థాయి నేత వరకూ పదే పదే ఖండిస్తూ కాపు ద్రోహిగా జగన్ ను చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.అయితే జగన్ తిరిగి దీనిపై వివరణ ఇవ్వటం, తాను కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నానని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ జగన్ తాజా ప్రకటనను కాపులు ఎవ్వరూ నమ్మరని కొత్త పల్లవి
అందుకుంది. అయితే మంగళవారం జగన్ వివరణతో తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రకు ఊహించని విధంగా స్పందన కన్పిస్తుందని వైసీపీ నేత  చెప్పారు. చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ, ఇప్పటి వరకూ..అంటే…జగన్ కాపు రిజర్వేషన్లపై మాట్లాడేంత వరకూ ఆయన దాని గురించి ఆలోచించలేదన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.జగన్ కాపు రిజర్వేషన్లు తన చేతులో లేదని చెప్పడంతో తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్రను అక్కడక్కడా కాపు నేతలు, యువకులు అడ్డుకున్నారు. కాని తాజా ప్రకటనతో జగన్ కు ఫ్లెక్సీలు కట్టి తమ గ్రామాలకు ఆహ్వానిస్తున్నారు. బీసీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లను అమలు చేస్తామని జగన్ చెప్పడాన్ని వారు స్వాగతిస్తున్నారు. అంతేకాదు తాను అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్ కు పదివేల కోట్ల రూపాయలు
కేటాయిస్తానని చెప్పి జగన్ కాపు సామాజిక వర్గంలో చోటు సంపాదించుకున్నారని వైసీపీ నేత చెప్పారు. ముద్రగడ పద్మనాభం సయితం జగన్ వ్యాఖ్యలను స్వాగతించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ తెలుగుదేశం పార్టీ వ్యూహానికి చెక్ పెట్టగలిగారంటున్నారు.
కాపు తుట్టెను కదిల్చిన జగన్ http://www.telugumuchatlu.com/pics-2/
Tags:Pics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *