Pics apologize: Minister Devineni

జగన్ క్షమాపణ చెప్పాలి : మంత్రి దేవినేని

Date:14/04/2018
విజయవాడ  ముచ్చట్లు:
ఎపి పట్టిసీమ దండగా 1600 కోట్లు నీళ్ళపాలు చేశావు అన్న జగన్ ఇవాళ కృష్ణాజిల్లా రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. కృష్ణాజిల్లా రైతాంగానికి ఇవాళ వేల కోట్ల రూపాయలు ఆదాయం  రైతులకు వచ్చేటట్లు చేశామని  జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. వ్యవసాయం పండుగైతే దండగ అన్న జగన్ రైతులకు   క్షమాపణ చెప్పి సభ ప్రారంభించాలని డిమాండ్ చేసారు. పట్టిసీమ ద్వారా క్రుష్ణాడెల్టా కు నీరిచ్చి శ్రీశైలం ద్వారా రాయలసీమ జిల్లాలకు146 టిఎమ్ సి లు నీరిచ్చి పంటలు కాపాడాం . ఇరిగేషన్ పై జగన్ కు అవగాహన లేదు
పోలవరం పవర్ ప్రాజెక్ట్ పవర్ హౌస్ కోసం స్పిల్ వేచ కాఫర్  డ్యాం టెండర్ ప్రీక్లోజర్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. పోలవరం డ్యామ్  ప్రదేశంలో నిర్మాణం జరగకుండా మీ మాజీ ఎమ్మెల్యే నాయకులతో అడ్డుకుంది నిజం కాదా అని నిలదీసారు. పులిచింతల ప్రాజెక్ట్ 2004 లో ప్రారంభిస్తే 2014 లో టిడిపి ప్రభుత్వం 495. కోట్లు ఖర్చు ఎందుకు పుర్తి చేయాల్సి వచ్చింది. పులిచింతల ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ కుడి కాలువకు నీళ్ళు ఇచ్చాం అన్న జగన్ అవి ఎక్కడికి వెళ్ళాయో చెప్పాలని అన్నారు. ప్రజా రాజధాని అంటే జగన్ కు ఈర్ష్య, ధ్వేషం.,.పోలవరం, అమరావతి పూర్తి కాకూడదనే కుట్రలు దొంగ కేసులు వేయిస్తున్నారని అయన విమర్శించారు. జగన్ కు నిజాయితీ ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారు. తమ్ముడూ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చి పశ్చాత్తాప పడకుండా పాదయాత్రలతో ఎవరిని మోసం చేస్తావని నిలదీసారు. నీటి ఎద్దడి లేకుండా క్రుష్ణాడెల్టాలో చెరువులన్నింటినీ నీటితో నింపాం. 53 వేల కోట్లు ఇరిగేషన్ నిధులు జల సంరక్షణా కార్యక్రమాలు ,ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఎన్నడూ లేని విధంగా ఖర్చు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ లో పట్టిసీమ పై క్లారిటీతో సమాధానం ఇచ్చాం..మూడున్నరేళ్ళుగా నోరు మెదపని బిజెపి వాళ్ళు ఇప్పుడు అరోపణలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
Tags:Pics apologize: Minister Devineni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *