Pics

బామ్మకు  చెప్పులు తొడిగిన జగన్

Date:19/06/2018
ఏలూరు ముచ్చట్లు:
పాదయాత్ర జనసందోహంలో తనను చూడటానికి వచ్చిన ఒక వృద్ధురాలికి స్వయంగా చెప్పులు తొడిగారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. జనంమధ్యన నిలబడటానికి కూడా సరిగా పట్టులేని ఆ బామ్మ చెప్పులు జారిపోయాయి. వారిమధ్యన ఆమె వాటిని తొడుక్కోలేకపోయింది. జగన్ దగ్గరే ఉన్న సమయంలో ఇలా జరిగింది. పరిస్థితిని గమనించిన ఆయన తనే వంగి ఆమెకు చెప్పులు తొడిగారు. వృద్ధురాలు వద్దని వారిస్తున్నా… జగన్ తన చేతులో ఆమె పాదాలకు చెప్పులు తొడిగారు. అనంతరం ఆమెతో తనదైన శైలిలో పలకరించి ముందుకు సాగారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజాసంకల్పయాత్రలోని ఈ సన్నివేశం ఆకట్టుకుంది. ఆ సమయంలో కెమెరాలు క్లిక్‌మనడంతో ఆ ఫొటో వెబ్‌లోకి అప్‌లోడ్ అయ్యి వైరల్‌గా మారింది. ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. జిల్లాలో ని పి.గన్నవరం నియోజకవర్గంలో జగన్ ప్రజాసంకల్పయాత్ర సాగుతోంది. ఇప్పటి వరకూ ఆయన 2,379 కిలోమీటర్ల దూరాన్ని నడిచారు.
Tags: Pics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *