అసెంబ్లీ సెగ్మెంట్లలో తటస్థులకే గులాబీ టికెట్లు .

హైదరాబాద్     ముచ్చట్లు:
ఇద్దరు నేతల మధ్య నెలకొన్న విభేదాలు మూడో వ్యక్తికి మేలు చేయనున్నాయి. వర్గ విభేదాలున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో తటస్థులకే గులాబీ టికెట్లు దక్కనున్నాయి. అభ్యర్థులను గుర్తించాలని ఇప్పటికే జిల్లా నాయకత్వాలకు టీఆర్ఎస్ అగ్రనేతలు సంకేతాలిచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ నుంచి 12 మంది, తెలుగుదేశం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సెగ్మెంట్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయినా ఈసారి టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇతర పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరిన సిట్టింగ్ సైతం టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేని కారణంగా ఒకరికి టికెట్ ఇస్తే మరొకరికి కోపం రావడం ఖాయం. ఇది ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది. దీనిని నివారించేందుకు తటస్థుల ఫార్ములాను ఎంచుకున్నది.వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాన్ని అవలంబించబోతున్నది. గ్రూపులున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఫార్ములాను అమలు చేయబోతున్నది. టికెట్ ఏ గ్రూపుకు చెందిన అభ్యర్థికి ఇచ్చినా అసంతృప్తితో ప్రత్యర్థి గ్రూపు విజయావకాశాలను దెబ్బతీసే చాన్సు ఉందని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నది. దీనికి విరుగుడుగా రెండు గ్రూపులకూ టికెట్లు ఇవ్వకుండా తటస్థంగా ఉండే కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నది. రాష్ట్రంలో దాదాపు పాతిక అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పరిస్థితి ఉంటుందని ఇప్పటికే అంచనాకు వచ్చింది. ఈ విషయాన్ని ఆ జిల్లాల నాయకత్వానికి సూచనప్రాయంగా తెలిపింది.
ప్రత్యామ్నాయ అభ్యర్థులను వెదకడంపై ఫోకస్ పెట్టాలని కూడా సూచించింది. తాజాగా ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో ఈ గ్రూపుల ఘర్షణలు బహిర్గతమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ ఇటీవల బయటపడింది. పలు జిల్లాల్లోనూ ఇవి ఉన్నట్లు పార్టీ అధిష్టానం గుర్తించింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని సందర్భాల్లో పరిష్కారానికి కూడా చొరవ తీసుకున్నా ఆశించిన ఫలితం రాలేదు. గ్రూపుల తగాదాలు పరిష్కారం కాకపోవడంతో ఎవరికి టికెట్ ఇచ్చినా అసంతృప్తి జ్వాలలు పోలింగ్ సమయానికి ఏ పరిణామానికి దారి తీస్తాయోననే ఆందోళన పార్టీని వెంటాడుతున్నది. దీనికి విరుగుడుగానే తటస్థులకు టికెట్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఒక జిల్లా నేత వివరించారు.కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది, తెలుగుదేశం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సెగ్మెంట్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయినా ఈసారి టికెట్‌ను ఆశిస్తున్నారు. కానీ ఇతర పార్టీ నుంచి గెలిచి ఇప్పుడు టీఆర్ఎస్‌లో చేరిన సిట్టింగ్ సైతం టికెట్‌ను ఆశిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేని కారణంగా ఒకరికి టికెట్ ఇస్తే మరొకరికి ఆగ్రహం కలిగే పరిస్థితులున్నాయి. ఇది ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా మారుతుందని అధిష్ఠానం లెక్కలు వేసింది. దీనిని నివారించేందుకు తటస్థుల ఫార్ములాను ఎంచుకున్నది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, పినపాక, అశ్వారావుపేట, పాలేరు, సత్తుపల్లి తదితర నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్య ఉన్నట్లు టీఆర్ఎస్ నాయకత్వం గుర్తించింది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోనూ కొన్నిచోట్ల ఇలాంటి సమస్యలే ఉన్నాయి.
పార్టీలోని రెండు గ్రూపుల పంచాయతీల పరిష్కారానికి చొరవ తీసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో మరో ప్రత్యామ్నాయం లేకుండాపోతున్నది. అందువల్లనే ఇద్దరికీ టికెట్‌లు నిరాకరించి వేరే రూపంలో వారికి పదవులు అప్పజెప్పాలనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు ఒక జిల్లా నేత ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయో జాబితా తయారుచేసింది. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఒక మీడియా సమావేశంలో “ఈసారి ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం” అని ప్రకటించారు. జిల్లా కమిటీలన్నీ ఎన్నికల కోణం నుంచే నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నాయి. హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా ఆ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేవారు. కానీ ఇటీవల ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. అవసరమైతే నాయకత్వ నిర్ణయాన్ని ధిక్కరించే కొత్త పరిణామం తలెత్తింది. పార్టీ కోసం పనిచేసినా పదవి రాలేదన్న అసంతృప్తి చాలా మందిలో నెలకొన్నది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆశలు పెట్టుకున్నా దాదాపు సగానికి పైగా ఖాళీగానే ఉండిపోయాయి. పార్టీకోసం పనిచేస్తున్నా ఇతర పార్టీ నుంచి వచ్చిన సిట్టింగ్‌కే మళ్లీఅవకాశం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లోనే కొన్ని చోట్ల టికెట్ రాకపోవడంతో రెబల్‌గా పోటీలో నిలిచారు. కొన్నిచోట్ల గెలిచారు. తిరిగి పార్టీలో స్థానం సంపాదించుకున్నారు. ఈసారి ఆ తరహా రెబల్ పరిస్థితి ఎదురైతే పార్టీ డ్యామేజ్ అవుతుందనే భయం వెంటాడుతున్నది. ఒకవైపు బీజేపీ గ్రామీణ స్థాయిలో పాగా వేస్తున్నదని టీఆర్ఎస్ నేతలు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అది తేటతెల్లమైంది. ఆ ఊపుతో బీజేపీ మరింత లోతుగా గ్రామాల్లోకి చొచ్చుకుపోతున్నట్లు టీఆర్ఎస్ గుర్తించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం బలోపేతమవుతున్నదని, టార్గెట్‌కు మించి డిజిటల్ సభ్యత్వం నమోదు కావడాన్ని టీఆర్ఎస్ ఒకింత సీరియస్‌గానే తీసుకున్నది. వంద జాకీలు పెట్టినా కాంగ్రెస్ లేవదు, అది డెత్ బెడ్ మీద ఉన్నది.. లాంటి కామెంట్లను టీఆర్ఎస్ నేతలు గంభీరంగా చెప్తున్నా క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితి భిన్నంగా ఉందన్న అభిప్రాయమూ జిల్లా నేతల్లో వ్యక్తమవుతున్నది. ఒకవైపు అగ్రనేత నేషనల్ పాలిటిక్స్ పైన దృష్టిపెట్టారు. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా కమిటీల సమన్వయం, పార్టీ ఫంక్షనింగ్‌పై ఫోకస్ పెట్టారు. తెలంగాణలో మూడోసారి పవర్‌ చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలన్న టీఆర్ఎస్ ప్లాన్‌కు నియోజకవర్గాల్లో గ్రూపుల తగాదాలు, వాటి పరిష్కారం తలనొప్పిగా మారింది. ఇందుకు ప్రత్యామ్నాయమే న్యూట్రల్ క్యాండిడేట్లను ఎంపిక చేయడం.
 
Tags:Pink tickets for neutrals in assembly segments

Natyam ad