ఆన్ లైన్ తో హెచ్ ఎండీఎ అవినీతి చెక్ పెట్టేందుకు ప్లాన్ 

Date:14/02/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో అవినీతికి ఆన్ లైన్ చెక్ పెట్టనున్నారు. క్షేత్ర స్థాయిలో ఉండే అధికారుల అవినీతి మూలంగా సంస్థకు రావాల్సిన అద్దె బకాయిలు పేరుకుపోతున్నాయి. ఎన్‌టీఆర్‌ గార్డెన్‌లోని జోన్‌పార్టీ పక్కన ఉండే ఓ షాపు నుంచే రూ.3 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేయడంలో ఇప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కమిషనర్‌  గుర్తించారు. మాన్యువల్‌ పద్దతిన సాగుతున్న నిర్వహణ వెనుక అవినీతి దాగి ఉందని గుర్తించిన అధికారులు దీన్ని ప్రక్షాళన చేసేందుకే అన్‌లైన్‌ సేవలు తీసుకువచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా రూపొందించే వెబ్‌సైట్‌ ద్వారా అవినీతికి చెక్‌పెట్టడంతో పాటు వీటి పరిధిలో నిర్వహించే వాణిజ్య కార్యాక్రమాల వివరాలను అప్‌లోడ్‌ చేస్తారు. దీంతో క్షేత్ర స్థాయిలో అధికారుల అవినీతి భాగోతానికి చరమగీతం పాడనున్నారు. నగరం నడిబొడ్డున హుస్సేన్‌సాగర్‌ తీర ప్రాంతం అభివృద్ధి, నిర్వహణ కోసం బుద్ద పూర్ణిమ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో నెక్లెస్‌రోడ్డు, హుస్సేన్‌సాగర్‌, లుంబీనీ, సంజీవయ్య, లేక్‌వ్యూ, ఎకో పార్కులు, ఎన్‌టీఆర్‌ గార్డెన్‌, ఎన్‌టీఆర్‌ ఘాట్‌, పీపుల్స్‌ ప్లాజా, పివీ జ్ఞాన్‌భూమిలు వస్తాయి. వీటి పరిధిలోని షాపుల అద్దెలు, లీజులు, పార్కు ప్రవేశ రుసుం, పార్కింగ్‌, హోర్డింగ్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ తదితర వాణిజ్య పరమైన సేవల ద్వారా సంస్థకు ఏడాదికి రూ.18 కోట్ల వరకు అదాయం వస్తుంది. అయితే లుంబీనీ పార్కులోని లేజర్‌షో, ఇంట్రాక్టీవ్‌ వాటర్‌ ఫాల్‌, చిల్డ్రన్‌ ప్లే ఎక్విప్‌మెంట్స్‌, బోటింగ్‌, కెఫ్టేరియా, ఎన్‌టీఆర్‌ గార్డెన్‌లోని మాచన్‌ట్రీ, వాటర్‌స్లైడ్‌, కార్‌ కేఫ్‌, టారు ట్రైన్‌, జపానీస్‌ గార్డెన్‌, ప్రూట్‌ రెస్టారెంట్‌, పార్టీజోన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్స్‌, వాణిజ్య షాపులు, నెెక్లెస్‌రోడ్‌లోని ల్యాండ్‌ స్కేపింగ్‌ లేక్‌ బ్యాంక్స్‌, పీపుల్స్‌ప్లాజా, ఫుడ్‌ కోర్టు, పార్కింగ్‌ కాంప్లెక్స్‌, వాక్‌వేపై గల షాపులు, ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌, సంజీవయ్య పార్కు, లేఖ్‌వ్యూ పార్కుతో పాటు అందులోని బోటింగ్‌, ఎకో పార్కుతో పాటు అందులోని బోటింగ్‌, పీవీ జ్ఞాన భూమి, వివిధ పార్కుల్లో ఉన్నటువంటి భారీ హోర్డింగ్స్‌, నెక్లెస్‌రోడ్డు మధ్యన డివైడర్‌పై ఏర్పాటు చేసిన ఆడ్వటైజ్‌మెంట్స్‌కు సంబంధించిన లాలీపాప్స్‌, ఆయా పార్కుల ముందు ఏర్పాటు చేసిన పార్కింగ్‌ల వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. బీపీపీకి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా. ఆన్‌లైన్‌లో తెలుసుకొని బుక్‌ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పేమేంట్స్‌ ఆన్‌లైన్‌లో చెల్లించగానే బుక్‌ చేసుకున్న వారికి అటోమెటిక్‌గా ఈ స్థలాలు రిజర్వ్‌ అవుతాయి. షాపు నిర్వహకులకు నిర్ణిత గడువులోగా అద్దె చెల్లించాలని ఎస్‌ఎంఎస్‌ వెళ్తుంది. అద్దె చెల్లించని వారి వివరాలు నిర్ణిత గడువు దాటగానే సంబంధిత అధికారి దృష్టికి వెళ్తాయి. ప్రతి నెల అద్దెలు చెల్లించాల్సిన వారి జాబితా ఉన్నతాధికారులకు వెళ్తుంది. వీటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుంది. క్షేత్ర స్థాయిలో అధికారులు అద్దెదారులతో కుమ్మక్కు కాకుండా, ఖచ్చితంగా అద్దెలు వసూలు చేయాల్సి వస్తోంది. దీంతో బకాయిలకు నూరు శాతం చెక్‌ పెట్టవచ్చనీ అధికారులు భావిస్తున్నారు. వాణిజ్య సంస్థలకు సంబంధించిన గడువు ముగియడానికి 15 రోజుల ముందే అధికారులకు తిరిగి టెండర్లు నిర్వహించాలని ఎస్‌ఎంఎస్‌ వెళ్లి అలర్ట్‌ చేస్తుంది.
Tags: Plan to check HDA Endowment Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *