పుంగనూరులో కాలుష్య నివారణకు మొక్కలు నాటాలి
పుంగనూరు ముచ్చట్లు:
పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా కోరారు. శుక్రవారం 1, 2 వార్డులలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కమిషనర్ రసూల్ఖాన్తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలోని 31 వార్డుల్లోను ఆయా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చురుగ్గా చేపట్టామన్నారు. గ్రీనరీని పెంపొందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ప్రజలు తమ ఇండ్ల ముందర మొక్కలు నాటి, సంరక్షించే బాధ్యతలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాగేంద్ర, కౌన్సిలర్ నరసింహులు, మైనార్టీ నాయకులు ఇంతియాజ్ఖాన్ పాల్గొన్నారు.
Tags: Plants should be planted in Punganur to prevent pollution