Chitur Polyasanna .... you're with me ...

పోలీసు’’సింహమే’’

– పోలీస్‌ జాగిలానికి రాచమర్యాదలు
– కేసులు చేదించి దర్యాప్తుకు తోడ్పడిందని అవార్డులు , ప్రశంసల వర్షం.

Date:15/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

సాధారణంగా మనచుట్టు సంచరించే గ్రామ సింహాలు(శునకాలు) చూస్తునే ఉంటాం. వాటికి ప్రత్యేకత అంటు ఉండదు. ఎప్పుడో శునకాల ప్రదర్శనలు జరిగితే అందమైన పెంపుడు రకరకాల శునకాలు చూసి ఆనందిస్తాం. అయితే పోలీసు శునకాలు (జాగిలాలు) తీరేవేరు. వాటికి మిగతా శునకాలు ఏవి సాటిరావు. నేరం జరిగితే దర్యాప్తు చేసేది, నింధితులను పట్టుకునేది పోలీసులే అయినా వారికి కీలకమైన ఆధారాలు , ఆచూకి లభించేలా చేసేది పోలీసు జాగిలాలే. ఇదే తరహాలో జఠిలమైన నేరాలను చేదించి, పోలీసులకు సహకరించిన చిత్తూరు జాగిలం మ్యాగి ఇప్పుడు చిత్తూరు జిల్లా పోలీసులకు సింహామే అయింది. దీని రుణం ఎలా తీర్చుకోవాలో అనుకుంటున్న పోలీసులకు మ్యాగికి సత్కరించాలన్న ఆలోచన వచ్చింది. శనివారం అందుకు చిత్తూరు పోలీస్‌ మైదానం వేదికైంది. చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు ఆదేశాల మేరకు పోలీస్‌ యంత్రాంగం జాగిలానికి మహర్ధశ కల్పించి, శునకమహారాజుగా మార్చేశారు. జాగిలం విశ్వాసానికి మారుపేరుగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. దానికి నిదర్శనంగా చిత్తూరు పోలీసులు జాగిలాన్ని అరుదైన రీతిలో సత్కరించారు. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో జరిగే అంతుచిక్కని నేరాలలో నేరస్తులను కనుగొనేందుకు మ్యాగి అనే జర్మన్‌షఫర్డ్ జాతీకి చెందిన జాగిలంను మనిగండన్‌ అనే పోలీస్‌ పర్యవేక్షిస్తూ, శిక్షణ ఇస్తున్నారు. ఐదు సంవత్సరాలు వయస్సు కలిగిన ఈ జాగిలం 2016లో మైసూర్‌లో జరిగిన డాగ్‌మ్యాగిలో నాల్గవ స్థానం పొందింది. అలాగే ఇండియన్‌ పోలీస్‌ డ్యూటిమీట్‌ 2017 చెన్నైలో జరిగింది. అందులో మ్యాగి కుక్కకు 9వ స్థానం లభించింది. అలాగే జనవరి 26 ,ఆగస్టు 15 , అక్టోబర్‌ 21న జరిగిన డాగ్‌డెమోషోలో ఈ జాగిలం అత్యంత తెలివిగా ప్రదర్శన చేసి ప్రశంసలు పొందింది. 2015 పెనుమూరు పోలీస్‌స్టేషన్‌లో జరిగిన హత్య కేసును, 2017 పంజాణి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన హత్య కేసును, 2018 తవనంపల్లె మండలంలో జరిగిన హత్య కేసును ఈ జాగిలం అత్యంత సులభంగా నింధితులను గుర్తించి,అరెస్ట్ చేయించి, ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా డిఎస్పీలు సుబ్బారావు, రామక్రిష్ణ, సీఐలు శ్రీనివాసులు, ఆదినారాయణ ఆధ్వర్యంలో మనిగండన్‌ జాగిలాన్ని తీసుకెళ్తుండగా పోలీస్‌బ్యాండ్‌ మేళాలతో జాగిలానికి మెడల్‌ను తగిలించి ప్రదర్శన చేశారు. తొలిసారిగా చిత్తూరు పోలీసులు జాగిలానికి ఇచ్చిన గౌరవాన్ని చూసి , పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, పోలీసులను అభినందిస్తున్నారు.

భారీ కమర్షియల్ హంగులతో సెప్టెంబర్ 21న రాబోతోన్న ‘సామి’

Tags: Police “cyaname”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *