పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ఉచిత శిక్షణ: డీజీపీ


హైదరాబాద్: పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డీ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈమేరకు కమిషనరేట్ లు, జిల్లాల పరిధిలో ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా యువతకు శిక్షణ ఇచ్చి.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా వాళ్లను చైతన్యపర్చాలని డీజీపీ తెలిపారు. గత ఏడేళ్లుగా జిల్లాలు, కమిషనరేట్ ల పరిధిలో యువతకు.. పోలీస్ అధికారులు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వసతి కూడా కల్పిస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన యువతీ యువకులు ఈ శిక్షణా శిబిరాలను ఉపయోగించుకొని పోలీసు ఉద్యోగాలు సాధిస్తున్నారు. హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న సమయంలో మహేందర్ రెడ్డీ శిక్షణా శిబిరాలు నిర్వహించారు. డీజీపీ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, కమిషనరేట్ ల  పరిధిలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు..

Natyam ad