Political crisis in Zimbabwe

 ముగాబేకు షాక్!

హరారే ముచ్చట్లు:

జింబాబ్వేలో రాజకీయ సంక్షోభం ముదురుతుంది. ఆ దేశ అధికార రాజకీయపక్షం జేఏఎన్యూ-పీఎఫ్ పార్టీ అధ్యక్షుడి స్థానం రాబర్ట్ ముగాబేను తొలగిస్తున్నట్లు పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. ఆదివారం ఆ పార్టీ నేతలు అత్యవసర సమావేశమై ముగాబేను తొలగించే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఆయన స్థానంలో పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ఎమ్మార్సన్ నంగ్వాంగ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు తెలిపారు. 37 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ముగాబే కొనసాగారు.దేశ అధ్యక్ష పదవి నుంచి కూడా ముగాబేను తప్పుకోవాల్సిందిగా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు చెప్పినా..అందుకు మాత్రం ఆయన నిరాకరించారు. గత మంగళవారం నుంచి ముగాబే గృహనిర్బంధంలో ఉన్న విషయం తెలిసిందే. బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి జింబాబ్వే అధ్యక్షుడిగా ముగాబేనే కొనసాగుతున్నారు. 93 ఏళ్ల వయస్సున్న ముగాబే తన రాజకీయ వారసురాలిగా భార్యను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు.దీంతో అధ్యక్షుడి వైఖరి నచ్చని సైన్యం ఆయన్ని గృహనిర్బంధంలో ఉంచింది.

Tag : political-crisis-in-zimbabwe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *