Natyam ad

పరువు నష్టం కేసులో కోర్టుకు హజరయిన పొన్నం

సూర్యాపేట ముచ్చట్లు:
పరువు నష్టం కేసులో  సూర్యాపేట అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మంగళవారం హజరయ్యారు. స్కాలర్ షిప్ కుంభకోణంలో.. మంత్రి జగదీష్ పాత్ర ఉందని అప్పట్లో అయన  ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో మంత్రి జగదీష్ రెడ్డి పొన్నం ప్రభాకర్ మీద అప్పట్లో పరువు నష్టం కేసు వేసారు. కోర్టు హజరయిన తరువాత అయన మీడియాతో మాట్లాడారు.
పొన్నం మాట్లాడుతూ కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను బీజేపీ అమ్ముతోంది. మత పరమైన అంశాలను లెవనెత్తి.. ఓట్లు దండుకునేందుకు బీజేపీ యత్నిస్తుంది. దేశ సౌరభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసి.. విభజన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుంది. తెలంగాణా సెంటిమెంట్ ని అగౌరపరిచే ప్రధానమంత్రిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నిలదీయడంలేదు? కాంగ్రెస్ లేకుండా కూటమి సాధ్యం కాదని కాంగ్రెస్ ఏతర పార్టీలే చెబుతున్నాయి. కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటు చేయడం అసంభవం. సంకీర్ణాలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. తెరాస తో కలిసి పనిచేయాల్సిన అవకాశం ఊహాజనీతమే. మూతబడే స్థితిలో ఉన్న బీజేపీ ని కేసీఆర్ జీవం పోస్తున్నాడు. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లును సమర్ధించిన టీఆర్ఎస్.. ఇప్పుడు వ్యతిరేక గళం ఎందుకు వినిపిస్తుంది.? ఇతర రాష్ట్రాల్లో కేంద్ర నిఘా సంస్థలను ప్రతిపక్షాల మీద ఉపయోగించే బీజేపీ.. తెలంగాణాలో మౌనం ఎందుకు? ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్ , బీజేపీ లు యత్నిస్తున్నాయి. బీజేపీ , టీఆర్ఎస్ ల వ్యవహారం మ్యాచ్ ఫిక్సింగ్ లా కనిపిస్తుంది. 105 సీట్లలో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ.. తెలంగాణాలో ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది. తెలంగాణా కోసం బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
 
Tags:Ponnam appearing in court in a defamation case