Poonam Kaur speaks against the sword of Mahesh

కత్తి మహేష్‌పై పూనం కౌర్ మాటల దాడి

Date: 08/01/2018

హెదరాబాద్‌ ముచ్చట్లు:

బిగ్‌బాస్ షోతో పాపులర్ అయ్యానని తనకు తానుగా భావించి ఇక పవన్ కళ్యాణ్‌ను తన ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ ఎట్రాకింగ్ కామెంట్స్ చేస్తున్న కత్తి మహేష్ రోజు రోజుకి శృతిమించుతున్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ అభిమానులు హెచ్.ఐ.వి కన్నా ప్రమాదమని చెబుతున్న కత్తి మహేష్‌కు రీసెంట్‌గా కోనా ఇచ్చిన కౌంటర్‌కు రీ కౌంటర్ కూడా తగిలించాడు. ఇక ఇప్పుడు కత్తి కామెంట్స్‌కు హీరోయిన్ పూనం కౌర్ కూడా స్పందించింది. కత్తి మహేష్ అన్న పేరుని వాడకుండా అమ్మడు అతన్ని ఆడేసుకుంది. ఒకరిని విమర్శిస్తూ డబ్బులు సంపాదించడం కన్నా బిచ్చగాళ్లు నయమని అంటున్న పూనం అతనికి ఫ్యాట్సో అని పేరు పెట్టేసింది. అంతేకాదు రోజు టీవీలో అతను కానొస్తున్నాడన్న విషయాన్ని ప్రస్తావిస్తూ అతని నిరుద్యోగ సమస్యను ఎవరైనా గుర్తించి ఉపాధి కల్పిస్తే బెటర్ అని అన్నది పూనం. అతని బరువు తగ్గడం కోసం అందరు చందాలేసుకోవాలని, అతని గురించి పట్టించుకోమని సీఎంకు రిక్వెస్ట్ చేసింది పూనం కౌర్. తన ఉద్దేశం ఏంటో తనకు అర్ధం కావడం వల్లే ఇలా కామెంట్ చేయాల్సి వస్తుందని, ఇలా చేయడం కూడా తనకు ఇష్టం లేదని పవన్ మీద తన అభిమానాన్ని చాటుకుంది పూనం కౌర్. ఇన్నాళ్లు పవన్ ఫ్యాన్స్‌కు మాత్రమే శత్రువైన మహేష్ కత్తి ఇప్పుడు సినిమా వాళ్ల కోపానికి కారణమవుతున్నాడు. ఇదిలావుండగా, పవన్ మీద విమర్శల దాడిని మరింతగా పెంచుతున్న కత్తి ఇప్పుడు మరో స్టార్ హీరో బాలయ్యను కూడా టార్గెట్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా బాలయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అభిమానుల్ని కొట్టడం అలవాటుగా మార్చుకున్న బాలయ్యకు హాస్పిటల్‌కు తీసుకెళ్లి సైక్రియాట్రిస్టుతో కౌన్సెలింగ్ చేయాల్సిన అవసరముందని చెప్పడం ద్వారా పరోక్షంగా బాలయ్యను పిచ్చాసుపత్రికి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డాడు కత్తి. మనుషుల్ని ముఖ్యంగా అభిమానుల్ని కొట్టడం అనైతికమని మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే అయి ఉండి కూడా బాలయ్య జనాల్ని కొట్టడం సభ్యత కాదని, ఆ హక్కు ఆయనకు లేదని అన్నాడు కత్తి. బాలయ్యకు మెడికల్ కౌన్సెలింగ్ అవసరమని, వీలైనంత త్వరగా బాలయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లి సైక్రియాట్రిస్టుతో చికిత్స చేయించాల్సిన అవసరముందని కత్తి అభిప్రాయపడ్డాడు. బాలయ్య తాను ఓ రాజు అయినట్లు, ఇంకా రాజులు రాజవంశాలు ఉన్నట్లు, తమ వంశం మాత్రమే గొప్పదైనట్లు ఫీలవుతున్నాడని కత్తి విమర్శించాడు. అయితే, కత్తి అభిప్రాయాలన్నీ కరెక్టే అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు అవసరమా? అన్నది ప్రశ్న.

Tags: Poonam Kaur speaks against the sword of Mahesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *