అయోధ్య కేసుపై తీర్పు వాయిదా

న్యూఢిల్లీ ముచ్చట్లు:

అయోధ్య భూ వివాదంపై కేసును సుప్రింకోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. కేసుపై సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ముగ్గరు జడ్జిల బెంచ్‌ ఇరువర్గాల వాదోపవాదనలు వింది. సున్నీ బోర్డు తరపున వాదన వినిపించిన కపిల్‌ సిబాల్‌…కేసు సంబందించిన అన్ని పత్రాలు తమకు చేరలేదని విన్నవించారు. కేసు విచారణను 2019 సాధారణ ఎన్నికల అనంతరం చేపట్టాలని కోరారు. లేకుంటే ఎన్నికల ఫలితాలపై తీర్పు ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెప్పారు. సిబాల్‌ వాదన విన్న ముగ్గరు జడ్జిల బెంచ్‌ ఎన్నికల వరకూ తీర్పు వాయిదాను తోసి పుచ్చింది. భూ వివాదానికి సంబంధించిన అన్ని వివరాల పత్రాలను అందజేసినట్లు అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ బెంచ్‌కు విన్నవించారు. కేసును 2018 ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు.

Tags : Postponed judgment on Ayodhya case


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *