Practice in the interval

అంతర్వేదిలో పోటెత్తిన భక్తజనం

-కంచుగరుడ వాహనంపై స్వామి వూరేగింపు

కాకినాడ ముచ్చట్లు:

నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించిన విషయం తెలిసిందే. తర్వాత కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. వారితోపాటు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యరావు, పలువురు ప్రజాప్రతినిధులు కూడా స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. కొత్త సంవత్సరం రోజున సుమారు 60 వేల మంది భక్తజనం స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన భక్తుడు నారసింహ వేషధారణలో అందరినీ ఆకట్టుకొన్నాడు. శ్రీలక్ష్మీనరసింహస్వామికి పల్లిపాలెం అగ్నికుల క్షత్రియులు ఆనవాయితీగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ముందుగా బాణసంచ, మేళతాళాలతో గ్రామమంతా వూరేగింపుగా తరలి వచ్చారు. స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం వీరు నిర్మించిన కంచుగరుడ, పంచముఖ ఆంజనేయస్వామి వాహనాలపై స్వామి, అమ్మవార్లను వైభవంగా వూరేగించారు.

Tags  Practice in the interval

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *