సాక్షి
Date :14/01/2018
బంజారాహిల్స్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్ మాచిరాజు ప్రదీప్ ఈ నెల 22వ తేదీన కోర్టులో హాజరుకానున్నారు. ఈమేరకు ట్రాఫిక్ అధికారులకు ఆయన సమాచారం అందించారు. గత నెల 31న అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రదీప్‌కు శ్వాస పరీక్షలలు చేయగా 178 బీఏసీ పాయింట్లు నమోదయ్యాయి. దీంతో ఆయన నడుపుతున్న బీఎండబ్ల్యూ కారును సీజ్ చేశారు. ఈ నెల 8వ తేదీన తన తండ్రితో కలిసి గోషామహల్‌లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 16న కోర్టుకు హాజరవుతానని ఇటీవలే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆరోజున కోర్టుకు సెలవు కావడంతో 22వ తేదీకి ఆయన హాజరు వాయిదా పడింది. నాంపల్లిలోని నాల్గవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ప్రదీప్‌ను పోలీసులు హాజరుపర్చనున్నారు. అదే రోజు ఆయనకు శిక్ష ఖరారు కానుంది.
Tags : Pradeep to appear before the court on March 22