Pravelli notice to Rahul Gandhi

రాహుల్ గాంధీకి ప్రివిలేజ్ నోటీసు

Date: 08/01/2018

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేసిన ఓ ట్వీట్ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. జైట్లీ పేరును రాహుల్ జైట్లైగా ఆ ట్వీట్‌లో సంబోధించారు. ‘‘డియర్ మిస్టర్ జైట్లై ప్రధాని చెప్పేదానికి చేసేదానికి ఎప్పుడూ పొంతన ఉండదని మరోసారి దేశానికి మీరు గుర్తుచేశారు’’ అని రాహుల్ చురకలు వేశారు. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు కనబడుతుండటంతో రాహుల్‌కు రాజ్యసభ చైర్మన్ నోటీసులు ఇచ్చారని, దీనిని సభాహక్కుల కమిటీకి పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రాహుల్ గాంధీ తన ట్వీట్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ఎన్నికల వేళ చేసిన స్పీచ్‌తో కూడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. ప్రధాని మోదీతో కలిసి జైట్లీ మేథస్సు రంగరించి సాధించిన స్థూల విభజన రాజకీయాలు (జీడీపీ)తో భారత్ తిరోగమనాన్ని రాహుల్ వివరిస్తూ నూతన పెట్టుబడులు 13 ఏళ్ల కనిష్టానికి, బ్యాంకు పరపతి పెరుగుదల 63 ఏళ్ల కనిష్టానికి దిగజారిందన్నారు. ఉద్యోగాల కల్పన ఏళ్ల దిగువకు పడిపోగా వ్యవసాయ స్థూల విలువ వృద్ధి 1.7 శాతం క్షీణించిందని, ద్రవ్యలోటు అయితే 8 ఏళ్ల గరిష్ఠానికి పెరిగిందన్నారు. నిలిచిపోయిన ప్రాజెక్టులయితే పైపైకి అంటూ నిలదీశారు.

Tags: Pravelli notice to Rahul Gandhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *