Presentation of the memorandum to Minister Amarnath Reddy in Palameraru

పలమనేరులో మంత్రి అమరనాథ్ రెడ్డి కి వినతిపత్రాలు సమర్పణ

Date: 20/12/2017
పలమనేరు ముచ్చట్లు:
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పలమనేరు పట్టణంలో పర్యటించిన మంత్రి అమరనాథ్ రెడ్డి కి ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి నెలలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ప్రాథమిక సమస్యలైన ఇళ్ళు, రేషన్ కార్డులు, ఫించన్లు అర్హులందరికీ మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పట్టణంలోని వార్డులలోని ప్రజలతో ఆయన ముచ్చటించారు. సమస్యలపై ఆరా తీసారు. కొత్తగా నిర్మించిన పలు భవనాలు, సీసీరోడ్లను ఆయన ప్రారంభించారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మొదటి రోజు వార్డు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కోశాధికారి ఆర్వీ సుభాష్ చంద్రబోస్, ఆర్వీ బాలాజీ, స్థానిక నాయకులు, వార్డు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
Presentation of the memorandum to Minister Amarnath Reddy in Palameraru
Presentation of the memorandum to Minister Amarnath Reddy in Palameraru
Tag: Presentation of the memorandum to Minister Amarnath Reddy in Palameraru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *