President Ramesh Kovind's nine-day overseas tour

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తొమ్మిదిరోజుల విదేశీ పర్యటన

Date:16/06/2018

న్యూఢిల్లీ ముచ్చట్లు:

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విదేశీ పర్యటనలో భాగంగా శనివారం గ్రీస్‌, సురినామ్‌, క్యూబా దేశాల పర్యటనకు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రపతి వివిధ పార్లమెంటు సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రి విష్ణుదేవ్‌సాయిలతో పాటు ఈ పర్యటన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పర్యటనలో మొదట ఏథేన్స్‌ను చేరుకోనున్నట్లు తెలిపారు. అక్కడ గ్రీకు అధ్యక్షుడు ప్రోకోపిస్‌ పావ్లోపౌలోస్‌తో పాటు ఇతర ప్రభుత్వం సీనియర్‌ అధికారులతో సమావేశమౌతారన్నారు. సిరునామ్‌, క్యూబా దేశాలలో కూడా పర్యటించి అక్కడి అధ్యక్షులతో సమావేశమౌతారని, అనంతరం ఆరోగ్యం, ఔషదం, ఎన్నికలు, ఐటి, ఆయుర్వేదం వంటి పలు అవగాహనా ఒప్పందాలతో పాటు పలు ఒప్పందాలలో సంతకాలు చేస్తారని వివరించారు.

 

Tags: President Ramesh Kovind’s nine-day overseas tour

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *