Priority for women's development: Mayor Nur Jahan

మహిళాభివృద్ధికి ప్రాధాన్యత: మేయర్ నూర్జహాన్‌

Date: 05/01/2018

ఏలూరుముచ్చట్లు:

రాష్ట్రంలో మహిళాభివృద్ధి, మహిళా శిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ఏలూరు నగర మేయరు షేక్‌ నూర్జహాన్‌ పెదబాబు అన్నారు. స్ధానిక చేపలతూము సెంటరులో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖాధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సామూహిక శీమంతాలు, అన్నప్రాశన కార్యక్రమాలలోరాష్ట్ర బిసి సంక్షేమ సంక్షేమశాఖా ప్రభుత్వ కార్యదర్శి బి. ఉదయలక్ష్మితో కలిసి మేయరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయరు షేక్‌ నూర్జహాన్‌ మాట్లాడుతూ గర్భిణీలకు ఐసిడియస్‌ ద్వారా పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా పౌష్టికాహారలోపం తగ్గించేందుకు ప్రభుత్వం ఉచితంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో గర్భిణీలకు, బాలింతలకు అన్న అమృతహస్తం క్రింద ఒక పూట పూర్తి భోజన సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ సంక్షేమశాఖా ప్రభుత్వ కార్యదర్శి బి. ఉదయలక్ష్మి మాట్లాడుతూ దేశంలో అతికొద్ది రాష్ట్రాల్లో మహిళాభివృద్దికోసం ఒక ప్రత్యేకశాఖను ఏర్పాటు చేసి ఆశాఖ ద్వారా మాతా శిశు సంరక్షణకోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఇందుకోసం 1750 కోట్ల రూపాయలు వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణకొరకు అన్న అమృతహస్తం, బాలామృతం, సబల, గోరుముద్దలు, మధ్యాహ్న భోజనం, తదితర పధకాలను అమలు చేస్తున్నదన్నారు. ఈసందర్భంగా పలువురు గర్భిణీలకు శీమంతాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యరావు, స్ధానిక కార్పోరేటర్‌ భీమవరపు హేమసుందరి, డిప్యూటీ మేయరు నాయుడు పోతురాజులు, తదితరులు పాల్గొని గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించారు.

Tags: Priority for women’s development: Mayor Nur Jahan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *