ప్రియా ప్రకాష్ పై కేసు నమోదు

Date:14/02/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
ఓర చూపులతో కుర్రాళ్ల మనుసుల్ని దోచేస్తున్న మలయాళ నటి ప్రియా ప్రకాష్. ఒక్క సీన్‌తో యూత్‌లో పిచ్చ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ… వివాదంలో చిక్కుకుంది. ఆమె హావభావాలతో అందరి మతిపోగొడుతుంటే ఓ వ్యక్తికి మాత్రం నచ్చలేదట. అంతే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆమెపై కేసు పెట్టాలని పోలీసుల్ని కోరాడు. అది కూడా ఎక్కడో కాదు… హైదరాబాద్‌లో. ప్రియా ప్రకాష్ సినిమా సీన్‌లో నటించి ముస్లింల మనోభావాలను దెబ్బ తీసిందని అబ్దుల్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు. ఆమెతో పాటు నిర్మాతపై కూడా చర్యలు తీసుకోవాలని కోరాడు.40 ఏళ్ల క్రితం రాసిన ముస్లిం సాంప్రదాయ పాటను ఈ సినిమాలో వాడారట… అందుకే మనోభావాలు దెబ్బతిన్నాయని కంప్లైంట్ చేశారు. హైదరాబాద్‌లో మాత్రమే కాదు కేరళలో కూడా ఈ పాటపై పెద్ద రగడే నడుస్తోంది. అయితే పోలీసులు మాత్రం న్యాయ సలహా తీసుకుంటామని చెబుతున్నారు. ఆ తర్వాత కేసుపై నిర్ణయం ఉంటుందంటున్నారు. ఈ సీన్‌కు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ట్రెండయ్యింది. ఇలాంటి సమయంలో ఈ పాట వివాదంలో చిక్కుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
Tags: Priya Prakash has registered a case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *