సోషల్ మీడియాలో ప్రియా స్టార్ 

Date:13/02/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఒక్క సీన్‌ కుర్రకారును ఊపేస్తోంది. కన్ను కొడుతూ కనిపించిన ఆ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్‌కు అందరూ ఫ్లాటై పోతున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏదనుకుంటున్నారా… ఒరు అదర్ లవ్ మూవీలోది. ఇప్పుడీ వీడియోను ఏకంగా 50 లక్షలకు మందికిపైగా చూసేశారు. ఈ అమ్మాయికి కొంతమంది స్టార్ హీరోలు కూడా ఫ్యాన్స్ అయిపోతున్నారు. అందరూ వరుసపెట్టి ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి చేరారు అల్లువారబ్బాయి బన్నీ. స్టైల్ స్టార్ కూడా ప్రియకు ఫిదా అయ్యాడు. ఆమె కన్నుకొడుతూ పలికించిన హావభావాలు అదుర్స్ అన్నాడు అర్జున్. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు.ఈ మధ్యకాలంలో తాను చూసిన క్యూ వీడియోల్లో ఇదొకటి. ది పవర్ ఆఫ్ సింప్లిసిటీ… లవ్ ఇట్ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. బన్నీనే కాదు కొందరు నెటిజన్లు ఈ వీడియోకు మహేష్ బాబు, రజనీకాంత్, సూర్యల రియాక్షన్లను పేరడీలు చేసి పోస్ట్ చేస్తున్నారు. మొత్తాన్ని ఈ ఒక్క సీన్‌తో ప్రియ సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది. ఈ రియాక్షన్స్‌, ఫ్యాన్స్ ఫాలోయింగ్‌తో ప్రియ తబ్బిబ్బవుతోందట. చూద్దాం ఈమెకు ఇంకెవరెవరూ ఫ్యాన్స్ అవుతారో.
Tags: Priya Star in Social Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *