క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రధానం..!

కమాన్ పూర్ ముచ్చట్లు:
కమాన్ పూర్ మండల కేంద్రంలోని రాంనాగర్ లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు , ఓటమిలు సహజమన్నారు. ఓడినా.. గెలిచిన క్రీడా స్పూర్తితో వ్యవహరించాలన్నారు. ఏ క్రీడల్లోనైన క్రీడాకారులు తమ ప్రతిభను మెరుగుపర్చుకుంటు ముందుకు సాగినప్పుడు విజయాలు దరి చేరుతాయన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో ఓటమి చెందినందుకు బాధ పడకుండా రాబోయే రోజుల్లో విజయకాంక్షతో ముందుకు సాగాలని సూచించారు. ఈ క్రికెట్  టోర్నీలో ప్రథమ బహుమతి “అనిరుద్ కమాన్ పూర్ వైన్స్” టీమ్ విజేతగా నిలువుగా, ద్వితీయ బహుమతి “మంథని” టీమ్ విజేతగా నిలిచింది. అలాగే తృతీయ బహుమతిని “కమాన్ పూర్ హనుమాన్”టీమ్ సాధించింది. ఈ విజేత జట్ల సభ్యులకు బహుమతులు అందజేశారు. అలాగే ఈ టోర్నీలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకార్లులకు కూడ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీ.ఆర్.ఎస్ మండల అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నీలం సరిత, నాయకులు రాచకొండ రవి, నీలం శ్రీనివాస్, బొమ్మగాని అనిల్ గౌడ్, క్రికెట్ టోర్నీ నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
 
Tags:Prizes for cricket tournament winners ..!

Natyam ad