సమస్యలు పరిష్కృతమవుతాయా?

Date:09/10/2018
గుంటూరు ముచ్చట్లు:
రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ పథకాలు అమలు చేస్తోంది. అన్ని ప్రాంతాలను అభివృద్ధికి నెలవుగా మలచేందుకు కృషి చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యం ఘనంగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అధికారులు ఉదాసీనంగా ఉంటుండడంతో పలు సమస్యలు పరిష్కరానికి నోచుకోవడంలేదని గుంటూరు వాసులు అంటున్నారు. ప్రధానంగా గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలకు చెక్ పడడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే సర్కార్ గ్రామాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందించింది. వాటి అమలుకు ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకాక గ్రామ దర్శిని-గ్రామ వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామానికి అధికారులు, స్థానిక నేతలు హాజరవుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది.
అయితే సమస్యలు పరిష్కారంలో మాత్రం ఫలితం ఉండడంలేదు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించడంలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పలు గ్రామాలకు సరైన రహదారులు లేవు. మండల కేంద్రాలకు.. కొన్ని ఊళ్లను అనుసుంధానించే రోడ్లు అధ్వానంగా యి. అంతేకాక తాగునీటికి ఇబ్బందులు పడుతున్న గ్రామాలు అనేకం ఉన్నాయి. వీధి దీపాలు, డ్రైనేజీలు సరిగా లేని ఊళ్లకూ కొదువలేదు. ఈ సమస్యలన్నింటికీ సత్వర పరిష్కారం లభించాల్సి ఉందని స్థానికులు అంటున్నారు.జిల్లాలోని వందలాది గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించడంపై సర్కార్ దృష్టి పెట్టింది. గ్రామదర్శినీలో గుర్తించిన సమస్యలు, రాబోయే ఆరు నెలల్లో చేపట్టాల్సిన అంశాలపై గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా నివేదికలు రూపొందించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
దీంతో అధికారులు జిల్లాలో మొత్తం 702 గ్రామాలకు గ్రామాభివృద్ధి ప్రణాళికలు రూపొందించారు. 51 వార్డులకు కూడా ప్రణాళికలు తయారు చేసినట్లు సమాచారం. వీటిల్లో అన్ని రకాల సమస్యలు ప్రస్తావనకు రావాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో రేషన్‌ కార్డులు, పింఛన్లు, స్కాలర్‌ షిప్‌ల సమస్యలనూ చేర్చుతున్నారు. ఇదిలాఉంటే సమస్యలు మరోసారి పనరావృతం కాకుండా శాస్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రతిపాదనలు పక్కగా ఉండాలని సూచించింది.
దీనికి తగ్గట్లుగానే అధికారులు సిమెంట్‌ రోడ్లు, మరుగుదొడ్లు, డ్రెయిన్స్, తాగునీటి కనెక్షన్లు, తాగునీటి పైపు లైన్ల ఏర్పాటు, కాల్వలు, పారిశుధ్య నిర్వహణ, వైద్య ఆరోగ్య సేవలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, బస్సు సౌకర్యం, బోర్లు, గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు, గ్రంథాలయం లాంటి అంశాలపై పూర్తి స్థాయి వివరాలను నమోదు చేసి ప్రణాళిక రూపొందించనున్నారు.
వీటిపై వచ్చే ఆరు నెలల్లో వీలైనంత ఎక్కువ సమస్యలు తీర్చేలా ప్రణాళిక తయారుచేస్తున్నారు. చాలాకాలంగా గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటుండడంతో ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఎన్నికల స్టంట్‌లా కాకుండా చిత్తశుద్ధితో సాగించాలని సమస్యలను శాస్వతంగా పరిష్కరించాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags:Problems solved?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *