Natyam ad

ఎంపీ మిధున్‌రెడ్డి వార్డుబాటలో సమస్యలు పరిష్కారం

పుంగనూరు ముచ్చట్లు:

లోక్‌సభ ఫ్యానల్‌ స్పీకర్‌, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి మున్సిపాలిటిలో వార్డుబాట నిర్వహించారు. సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో వార్డు బాట సమస్యల పరిష్కారానికి రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణంతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ అలీమ్‌బాషా మాట్లాడుతూ ఎంపీ ఆదేశాల మేరకు వార్డుబాటలో వచ్చిన సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామన్నారు. ఈ మేరకు పెన్షన్లు, ఇండ్లు, వ్యక్తి గత సమస్యలను పరిష్కరించామన్నారు. ఎంపీ పర్యటనలో వెహోత్తం 162 వినతిపత్రాలు అందిందని , అన్నింటిని పరిష్కరించామన్నారు. రోడ్లు, కాలువలు, పైపులైన్లకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై పనులు మంజూరు చేశామన్నారు. ఎంపీ పర్యటనలో వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించి , ప్రజలకు పరిపాలనపై పూర్తి విశ్వాసం ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. కొండవీటి నాగభూషణం మాట్లాడుతూ పట్టణ ప్రజల సమస్యలను గుర్తించేందుకు ఆయా వార్డులలో కౌన్సిలర్లు , సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో కలసి పర్యటించాలన్నారు. సమస్యలను ఏరోజుకు ఆరోజు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో ఎంపీ పీఏలు రాజు, దస్తగిరితో పాటు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, వైఎస్సార్‌సీపీ నాయకులు నరసింహులు, శ్రీనివాసులు, రాజేష్‌, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Problems solved in MP Midhun Reddy’s ward

Post Midle