Prohibition on pornography is impossible!

అశ్లీలత‌పై నిషేధం అసాధ్యం!

Date : 14/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

దేశంలోకి చొచ్చుకు వ‌స్తున్న అశ్లీల వెబ్ సైట్ల బెడ‌ద ఈ నాటిది కాదు. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల‌లో స‌హా అన్ని చోట్లా ఇంట‌ర్నెట్ విస్తృతి ఎలా పెరుగుతున్న‌దో అంతే స్థాయిలో అశ్లీల వెబ్ సైట్ల ప్ర‌వాహం ఎక్కువ అవుతూ వ‌చ్చింది. యువ‌త‌రం నుంచి పెద్ద‌త‌రం వ‌ర‌కూ అశ్లీల వెబ్ సైట్లు చూసేందుకు అల‌వాటు ప‌డిపోయార‌నే విష‌యం ఇప్ప‌టికే చాలా స‌ర్వేల్లో తేలింది. అశ్లీల వెబ్ సైట్ల‌ను చూసే వారిలో మ‌గ‌వారితో పాటు మ‌హిళ‌ల సంఖ్య లెక్క‌కు మించి ఉండ‌టం విప‌రీత ప‌రిణామం. అందుకే విప‌రితంగా పుట్టుకొస్తున్న అశ్లీల వెబ్ సైట్ల‌ను నిషేధించాల‌నే ఆలోచ‌న చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే ఇలాంటి అశ్లీల వెబ్ సైట్ల‌ను ఏ విధంగా నిషేదించాల‌నే ఆంశంపై ఇంత కాలం ఎవ‌రూ ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోయారు. చాలా దేశాల‌లో అశ్లీల వెబ్ సైట్ల‌ను చ‌ట్ట‌బ‌ద్ధంగానే నిర్వ‌హిస్తున్నారు. అయితే చైనాలో ఇలాంటి అశ్లీల వెబ్ సైట్ల‌ను పూర్తిగా నిషేధించారు. అక్క‌డ ఆన్‌లైన్ కంటెంట్‌ను అదుపుచేసేందుకు వినియోగ‌దారులు అంగీక‌రించి స‌హ‌కరించ‌డం వ‌ల్ల చైనా ప్ర‌భుత్వం నిషేదం సాధ్యమైంది. మ‌న‌దేశంలో అలాంటి వెసులు బాటు లేనందున ఇంత‌కాలం అశ్లీల వెబ్ సైట్ల‌ను నిషేందించలేక‌పోయారు. దేశంలో అత్యాచారాలు, హ‌త్య‌లు పెరిగిపోవడానికి అశ్లీల వెబ్ సైట్లు, నీలిచిత్రాలు కార‌ణ‌మంటూ క‌మలేష్ వాస్వానీ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌నాల వ్యాజ్యం దాఖ‌లు చేశారు. అయితే అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం ఈ వాద‌న‌తో ఏకీభ‌వించ‌లేదు. స‌మాజంలో నేరాలు పెర‌గ‌డానికి ఈ విష‌యానికి సంబంధం లేద‌ని సుప్రీం కోర్టుకు విన్న‌వించింది. ఒక‌వేళ నిషేధించాల‌నుకున్నా కూడా సాంకేతిక ఇబ్బందుల వ‌ల్ల ఆ ప‌ని స‌మ‌ర్దంగా చేయ‌లేద‌ని కూడా కోర్టుకు తెలిపారు. ఆ త‌రువాత ఇదే అంశంపై దాఖ‌లైన మ‌రో కేసు విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు సునిశిత‌మైన మ‌రో అంశాన్ని ప్ర‌స్తావించింది. నాలుగు గోడ‌ల మ‌ధ్య ఒక వ్య‌క్తి అశ్లీల వెబ్ సైట్‌ను చూడాల‌నుకుంటే నిషేధించడం సాధ్యమౌతుందా? అని కూడా సుప్రీం కోర్టు ప్ర‌శ్నించింది. ఒక‌వేళ ఆ విధంగా చేయ‌డ‌మంటే వ్య‌క్తి గ‌త స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మేన‌ని అది రాజ్యాంగంలోని 21వ అధిక‌ర‌ణాన్ని ఉల్లంఘించ‌డ‌మేన‌ని కూడా సుప్రీం కోర్టు అభిప్రాయ‌ప‌డింది. నాలుగు గోడ‌ల మ‌ధ్య ఒక వ్య‌క్తి ర‌హ‌స్యంగా అశ్లీల వెబ్‌సైట్లు చూస్తే వ‌చ్చే న‌ష్టం ఏమిట‌ని కూడా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. ఈ వెబ్ సైట్ల‌ను చిన్నారులు చూడకుండా, పెద్ద‌లు కూడా ప‌బ్లిక్‌గా వీక్షించ‌కుండా నిరోధించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ట్ట‌ప‌ర‌మైన జాగ్ర‌త‌లు తీసుకోవాల‌ని సుప్రీం కోర్టు కేంద్రానికి ఆదేశించింది. అంటే అశ్లీల వెబ్ సైట్లును నిషేధించ‌డం మ‌న‌దేశంలో దాదాపుగా అసాధ్య‌మ‌న్న‌మాట‌. అలా చేస్తే సుప్రీం కోర్టు ఆదేశాల‌ను ఉల్ల‌ఘించ‌డ‌మే అవుతుంది. అయితే అటువంటి అసాధ్య‌మైన ప‌నిని చేసి చూపించాల‌ని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం భావించిన‌ట్లుగా క‌నిపిస్తున్న‌ది. దీంతో దేశంలో పుంఖాను పుంఖాలుగా పుట్టుకొస్తున్న అశ్లీల వెబ్‌సైట్ల‌పై కేంద్రం కొర‌డా ఝ‌ళిపించింది. అయితే నేరుగా ఆయా వెబ్ సైట్ల‌పై నిషేధం విధించ‌కుండా ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల‌ (ఐఎసీల‌) ద్వారా వాటిని బ్లాక్ చేయాల్సిందిగా టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 8557 అశ్లీల వెబ్ సైట్ల‌ను ఈ విధంగా స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల ద్వారా నిషేధించిన‌ట్లు సెంట‌ర్ ఫ‌ర్ ఇంట‌ర్నెట్ అండ్ సొసైటీ వారు తెలిపారు. నైతిక‌త‌, మ‌ర్యాదకు భంగం క‌లిగిస్తున్నందున్న రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్19(2), ఐటీ చ‌ట్టంలోని 79(3)(బి) ప్ర‌కారం ఈ వెబ్ సైట్ల‌ను నిషేధిస్తున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. ఈ ప‌రిణామం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అశ్లీల వెబ్ సైట్లు, నీలి చిత్రాల‌ను అరిక‌ట్ట‌డంలో ఇది తొలి చ‌ర్య‌గా కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. సుప్రీం కోర్టు చెప్పింది కాబ‌ట్టి అశ్లీల వెబ్ సైట్ల నిషేధం జోలికి వెళ్ల‌కుండా స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల ద్వారా వాటిని క‌ట్ట‌డి చేయాల‌ని నాలుగు రోజుల క్రితం ఢిల్లోలో జ‌రిగిన ఓ స‌మావేశంలో కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వ రంగానిక చెందిన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, ప్రైవేట్ రంగంలోని యాక్ట్ పైబ‌ర్ హాత్ వే, వొడాఫోన్, రెడ్ జింజ‌ర్, స్పెక్ట్ర‌నెట్, ఆసియానెట్ వంటి ఐఎస్పీలు అశ్లీల వెబ్ సైట్ల‌ను బ్లాక్ చేశాయి. కొన్ని ఐఎస్పీలు ఆయా సైట్‌ల‌ను బ్లాక్ చేయ‌డంతో పాటు వాటిని ఓపెన్ చేసిన వారికి ఆయా సైట్ల‌ను ఎందుకు బ్లాక్ చేశామో వివ‌రిస్తున్నాయి. మ‌రికొన్ని మాత్రం ఎర‌ర్ మెసేజ్ చూపిస్తుండ‌గా ఇంకొన్ని బ్లాంక్ పేజ్ చూపుతున్నాయి. కేంద్ర స‌మాచార‌, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల‌ను అమ‌లుచేస్తున్న‌ట్లుగా మ‌రి కొన్ని చెబుతున్నాయి. కేంద్ర స‌మాచార‌, ప్ర‌సార మంత్రిత్వ శాఖ ఆదేశాల‌ను అమ‌లు చేస్తున్న‌ట్లుగా మ‌రి కొన్ని చెబుతున్నాయి. అయితే ప్రైవేటు రంగంలో పెద్ద‌వైన ఎంటీఎస్, ఎయిర్టెల్ వంటి ఐఎస్పీలు మాత్రం అశ్లీల వెబ్ సైట్ల‌ను మాత్రం బ్లాక్ చేయ‌లేదు. దీంతో ఈ సంస్థ‌ల ద్వారా ఇంట‌ర్నెట్ పొందుతున్న వారు ఆ సైట్‌ల‌ను చూడగ‌లుగుతున్నారు. అశ్లీల వెబ్ సైట్ల‌ను బ్లాక్ చేయాలంటూ లిఖిత పూర్వ‌కంగా త‌మ‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని ఈ సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. బ్లాక్ చేసిన అశ్లీల వెబ్ సైట్ల‌లో కొన్ని ఇప్ప‌టికే కొత్త ఐపీ నెంబ‌ర్ల తో, పేరుమార్చుకొని వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాయని ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్సాన్స్ టీమ్ కేంద్రానికి నివేదించింది. ఈ వ్య‌వ‌హారాన్ని క‌నిపెట్టేందుకు నిఘా విభాగం దేశ వ్యాప్తంగా నిఘా పెట్టింది. ఎంత నిఘా పెట్టినా ల‌క్షలాదిగా ఇలాంటి వెబ్ సైట్లు చ‌లామ‌ణిలోను ఉంటున్నాయి. అశ్లీల వెబ్ సైట్లు చూసేందుకు అల‌వాటు ప‌డ్డవారు వాటిని ఏదోక విధంగా తీసి చూసేందుకే శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నిషేదాన్ని ఉల్లంఘించేందుకు కొత్త ప‌ద్ధ‌తులు, ప‌రికారాలు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా నాలుగు కోట్ల అశ్లీల వెబ్ సైట్లు ఉన్నాయ‌ని ఒక అంచ‌నా. అన్ని వెబ్ సైట్లు కూడా భార‌త్ వెలుప‌లే ఉన్నాయి. చాలా వెబ్ సైట్లు ఆయా దేశాల నుంచి చ‌ట్ట‌బ‌ద్దంగా అనుమ‌తి పొంది న‌డుస్తున్న‌వే. వాటిని అడ్డుకోవ‌డం క‌ష్ట సాద్య‌మే అవుతుంది. చాలా వ‌ర‌కూ తాము తీసుకునే అవ‌కాశం ఉంది. త‌ద్వారా స‌ర్వీసు ప్రొవైడ‌ర్లకు స‌మ‌స్య‌లు రావ‌చ్చు. నైతిక విలువ‌లు పెరిగి అశ్లీల సాహిత్యం, వెబ్ సైట్లు త‌గ్గాల్సిందే తప్ప పూర్తిగా నిషేదిస్తామంటే అది సాధ్యం కాక‌పోవ‌చ్చు.

Tags: Prohibition on pornography is impossible!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *