కత్తిపోట్లకు దారి తీసిన ఆస్తి వివాదం

సూర్యాపేట ముచ్చట్లు:
 
ఆస్తి వివాదంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. మతిస్థిమితం లేని వ్యక్తి తన భావ, సోదరుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం ఇస్తాలాపురం లో  చోటు చేసుకుంది. తల్లి దిశ దినకర్మ జపించాల్సిన క్రమంలో అన్నదమ్ముల ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. మతిస్థిమితం లేని చంద్రశేఖర రావు ఇంట్లో ఉన్న కత్తితో సోదరుడు హనుమంతరావుపై దాడి చేశాడు, ఘర్షణను అడ్డుకోవడానికి వచ్చిన బావ పైనా దాడికి పాల్పడ్డాడు చంద్రశేఖర రావు. ఈదాడిలో సోదరుడికి ఆయన బావకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు నిందితున్ని పట్టుకొని చితకబాదారు. తీవ్రగాయాలైన ఒకరిని సూర్యాపేట కు తరలిచారు పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దాడులను అరికట్టాలి
Tags: Property dispute leading to stabbings

Natyam ad