Natyam ad

థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన

ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
 
కృష్ణ పట్నం దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆద్వర్యంలో వీటీపీఎస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన సీఐటీయూ నాయకులు.ఎస్డీఎస్టీపీటీ రక్షించుకుందాం అంటూ నినాదాలు చేశారు.విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజలపై అధిక భారం పడుతుందని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలకు నాసిరకం బొగ్గు ను సరఫరా చేస్తూ, ప్రైవేటు రంగ సంస్థలకు నాణ్యమైన బొగ్గు ను సరఫరా చేయడం వల్ల ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి తగ్గించి ప్రభుత్వం సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.ఈ నెల జీతాలు కూడా వెంటనే చెల్లించాలని అదే విధంగా కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ పరిమినెంట్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ వి.ఉమామహేశ్వరరావు,ఎపి కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ వర్కర్స్ జెఎసి సెక్రటరీ జనరల్ మిరియాల బాల కాశీ, పశ్చిమ కృష్ణ సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ సి ఎచ్ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం మండలం సిఐటియు కార్యదర్శి ఎం మహేష్, విఠల్ రావు, కొండలరావు, కామేశ్వరరావు, నారాయణ, ఐద్వా నాయకురాలు బేబీ సరోజినీ తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Protest against privatization of thermal power station