రెచ్చగొట్టి గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ-టీజీవీ .

కర్నూలు ముచ్చట్లు:
పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి గెలిచిందని రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలులో నిర్వహించిన బీజేపీ జిల్లా శక్తి కేంద్రాల ప్రముఖుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ.. భారతీయ జనతాపార్టీ ప్రణాళికాబద్ధంగా ముందుకుపోతున్న పార్టీ అని.. అందుకు నిదర్శనం ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాలే అని అన్నారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిందని,పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి గెలిచిందని,ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి హిందువులే కాకుండా, మతాలకు అతీతంగా మైనారిటీలు కూడా ప్రచారంలో పాల్గొని అధికారంలోకి రావడానికి కృషి చేశారని టీజీ వెంకటేశ్ అన్నారు. ఏపీలో మైనార్టీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తోందని.. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను వినియోగించ లేకపోవడంతో నిధులన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయన్నారు.
 
Tags:Provocatively winning Aam Aadmi Party-TGV

Natyam ad