Natyam ad

3 జిల్లాల్లో సై అంటున్న పందెం కోళ్లు

ఏలూరు ముచ్చట్లు:
 
సంక్రాంతి పండుగంటేనే కోళ్ల పందేలకు ఫేమస్‌.. ఎంతో హుషారుగా కాయ్‌రాజాకాయ్‌ అంటూ యువతతో పాటు స్థానిక ప్రముఖులు కూడా ఈ పందేలలో పాల్గొంటుంటారు. అయితే ఈ కోడి పందేలను గతంలో సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధించింది. ఆ తరువాత 2018 జనవరిలో కత్తులు, బ్లేడ్లు ఉపయోగించకుండా, జూదం లేకుండా, ఈ పద్ధతిని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. అయితే కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ కోడి పందేలకు ఎక్కువగా ఆతిథ్యమిస్తుంటాయి. అయితే ఈ కోళ్ల పందేలలో అన్ని కోడిపుంజులను బరిలోకి దించరు. కోళ్లలో కూడా పందెంకోళ్లు ప్రత్యేకంగా ఉంటాయి. వాటి గురించి చాలామందికి తెలియదు.. పందెనికి వాడే పందెం కోళ్ల గురించి తెలుసుకుందాం..కాకి – నల్లని ఈకలు గల కోడి పుంజు, నెమలి – రెక్కలపై, లేక వీపు పై పసుపు రంగు ఈకలు గల కోడి పుంజు, పర్ల – మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా గల కోడి పుంజు, సేతు – తెల్లని ఈకలు గల కోడి పుంజు, కొక్కిరాయి (కోడి) – నల్లటి శరీరం, 2, 3 రంగుల ఈకలు గల కోడి పుంజు, సవల – మెడపై నల్లని ఈకలు గల కోడి పుంజు, డేగ – ఎర్రటి ఈకలు గల కోడి పుంజు, కౌజు – నలుపు, ఎరుపు, పసుపు ఈకలు గల కోడి పుంజు, పూల – ఒక్కొక్క ఈకపై నలుపు, తెలుపు, ఎరుపు రంగులు గల కోడిపుంజు, మైల – ఎరుపు, బూడిద రంగుల ఈకలు గల కోడి పుంజు, అబ్రాసు – లేత బంగారు రంగు ఈకలు గల పుంజు.పింగళ – తెలుపు రెక్కల పై అక్కడక్కడా నలుపు రంగు, లేత గోధుమ రంగు ఈకలు గల కోడి పుంజు, గేరువా – తెలుపు, లేత ఎరుపు ఈకలు గల పుంజు, ముంగిస – ముంగిస జూలు రంగు గల పుంజు రకాలు ఉండగా. వీటితో పాటు తక్కువగా లభించే రకాలు.. తెలుపు గౌడు (నలుపు, తెలుపు ఈకలు గల కోడి పుంజు), కాకి నెమలి, కోడి నెమలి, పచ్చ కాకి, ఎరుపు గౌడు (నలుపు, ఎరుపు ఈకలు గల కోడి పుంజు), నల్ల మచ్చల సేతు (తెల్లని ఈకలపై నల్ల మచ్చలు గల కోడి పుంజు), నల్ల సవల (రెక్కల పై నల్ల మచ్చలు గల కోడిపుంజు). అయితే ఈ కోడి పుంజులలో పచ్చకాకి, కాకి, డేగ, కాకి నెమలి రకాలు ప్రత్యేకమైనవేకాకుండా ఖరీదులోనూ ఆగ్రస్థానంలో ఉంటాయి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Psy says bet chickens in 3 districts