ప్రజా పోరాటమే… పంధా…?

ఖమ్మం ముచ్చట్లు:
ప్రజా సమస్యల కోసం లీగల్ కేడర్ ఒకవైపు, అజ్ఞాత దళాలు మరొకవైపు కలిగివున్న బలమైన నక్సల్స్ పార్టీ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ. ఇల్లందు నియోజక వర్గం దానికి పట్టుకొమ్మ. అలాంటి బలం కలిగిన న్యూ డెమోక్రసీ పార్టీ చీలికలు పీలికలుగా విడిపోయింది, అందులో నుండి మళ్లీ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రజాపంథా పేరుతో మరో నక్సలైట్ పార్టీ నూతనంగా ఆవిర్భవించింది.న్యూ డెమోక్రసీ పార్టీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బలమైన కేంద్ర బిందువు. మొదట సీపీఐఐ ఎంఎల్ పార్టీగా ఇల్లందు నియోజకవర్గంలో ప్రజలకు పరిచయమై, ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్న నేపథ్యంలోనే సిద్ధాంత విభేదాలతో 1984 -85 సంవత్సరంలో ఎమ్మెల్ పార్టీ రెండుగా విడిపోయింది. సిపిఐ ఎంఎల్ విమోచన పార్టీగా, సిపిఐ ఎంఎల్ ప్రజా పందా పార్టీగా విడిపోయాయి. విమోచన పార్టీకి చండ్ర పుల్లారెడ్డి నాయకత్వం వహించగా, ప్రజా పంథా పార్టీకి పైలా వాసుదేవరావు నాయకత్వం వహించారు. విమోచన పార్టీ జనశక్తిగా, ప్రజా ప్రతిఘటన గా అనేక చీలికలు పీలికలు గా విడిపోయి చివరికి ఉనికి లేకుండా పోయింది. ఇక పైలా వాసుదేవరావు నాయకత్వం వహిస్తున్న సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ అనతికాలంలోనే సిపిఐఎం ఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గా పేరు మారింది.న్యూ డెమోక్రసీ పార్టీ ఇల్లందు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థానాన్ని ఏకధాటిగా ఐదుసార్లు గెలిపించుకుంది. ఈ పార్టీ 2013లో సిద్ధాంత పరమైన విభేదాలతో రాయల వర్గం, చంద్రన్న వర్గంగా చలామణీ అవుతున్నాయి. చంద్రన్న వర్గం కేంద్ర కమిటీని ఏర్పాటు చేసుకుంది. చంద్రన్న వర్గానికి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పెద్ద చంద్రన్న బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రాయల వర్గానికి కేంద్ర కమిటీ బాధ్యతలను యతీంద్ర కుమార్ నిర్వహిస్తున్నారు. ఈ రెండూ వర్గాలు న్యూ డెమోక్రసీ పార్టీ పేరుతోనే ఇల్లందు పట్టణంలో మండల కేంద్రాలలో వేరు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. యతీంద్ర కుమార్ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న న్యూ డెమోక్రసీ పార్టీలో కొంతమంది కేంద్ర కమిటీ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నది.కమిటీ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ అనుసరిస్తున్న పిడివాద విధానాలను అనుసరిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో మరో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని విచ్చిన్నం చేయడానికి పూనుకోవడం జరుగుతుందని భావించి కేంద్ర కమిటీ నుండి విడిపోవడం అనివార్యమయింది అని నూతనంగా ఆవిర్భవించిన ప్రజాపంథా పార్టీ నాయకులు ప్రకటన విడుదల చేశారు. రాయల వర్గానికి చెందిన పోటు రంగారావు కేంద్ర కమిటీలో ఉన్నారు. ఆయన బయటికి వచ్చి మరి కొంతమంది తో కలిసి ప్రజాపంథా పేరుతో పార్టీని నెలకొల్పారు. పోటు రంగారావు, రంగయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తదితరులతో నూతనంగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.ఇల్లందు నియోజకవర్గంలో బలమైన నక్సలైట్ పార్టీగా ఉన్న న్యూ డెమోక్రసీ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీ వర్గాలుగా విడిపోవడం వలన అసెంబ్లీ ఎన్నికల్లో4వ స్థానానికి చేరుకుంది. న్యూ డెమోక్రసీ పార్టీ విడిపోవడం వలన ఇప్పటికే మెల్లమెల్లగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు రాయల వర్గంలోని మరొక వర్గం ప్రజా పంథా పేరుతో వస్తున్న కొత్త సీసాలో పాత సారా అన్నట్టు, మారింది పేరు మాత్రమే, వ్యక్తులు మాత్రం వారే అవడం వలన ప్రజల సమస్యలపై ఎలాంటి పోరాటాలు చేయనున్నారో చూడాలి మరి.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags:Public struggle … bet …?

Natyam ad