Punganur MLA Dr. Peddireddy Ramachandra Reddy's New Year greetings MLAs and leaders

పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, నాయకులు

Date : 01/01/2018

సదుం ముచ్చట్లు:

ఆంగ్ల నూతన సంవత్సరం 2018 ప్రారంభం సందర్భంగా పుంగనూరు ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 2018 కొత్త సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ ను పెద్దిరెడ్డి ఆవిష్కరించారు. సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లె గ్రామంలోని పెద్దిరెడ్డి స్వగృహానికి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, సునీల్ కుమార్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, పెద్దపంజాణి మాజీ ఎంపీపీ విజయభాస్కరరెడ్డి, మండల కన్వీనర్‌ బాగారెడ్డి,జిల్లా కార్యదర్శులు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా మైనారిటీ ప్రధాన కార్యదర్శి వి.సుహేబ్ తన సొంత ఖర్చులతో పెద్దిరెడ్డి ఫోటోని ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌లను పుంగనూరు ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు నారాయణస్వామి, సునీల్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ విజయభాస్కరరెడ్డి సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సంపల్లె బాబురెడ్డి, తమ్మిరెడ్డి, రవి, రహంతుల్లా, కాపు నాయకుడు ఆకుల గజేంద్ర ప్రసాద్ సింగిల్ విండో అధ్యక్షుడు శంసీతారాం,నాయకులు భాస్కర్ రెడ్డి, యరబల్లి శ్రీనివాసులు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాసులు, మార్కొండయ్య, శ్రీరాములు, రెడ్డెప్ప, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Tags : Punganur MLA Dr. Peddireddy Ramachandra Reddy’s New Year greetings MLAs and leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *