పుంగనూరు తెలుగుదేశం టికెట్‌ శ్రీనాథరెడ్డికి ఇవ్వాలి

Date:14/01/2018

– దివంగత రామక్రిష్ణారెడ్డి జయంతి వేడుకల్లో అభిమానుల డిమాండు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు తెలుగుదేశం పార్టీ అసెంబ్లి టికెట్‌ను నూతనకాల్వ శ్రీనాథరెడ్డికి ఇవ్వాలని అభిమానులు డిమాండు చేశారు. దివంగత ఎంపి రామక్రిష్ణారెడ్డి 82వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్‌ శ్రీనాథరెడ్డి, ఆయన సతీమణి అనీషారెడ్డి , రామక్రిష్ణారెడ్డి సోదరుడు డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, అభిమానులు కలసి ఎన్టీఆర్‌, రామక్రిష్ణారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ , రామక్రిష్ణారెడ్డి సేవలను కొనియాడారు. డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి , నూతనకాల్వ కుటుంబానికి రాజకీయ పదవులను కల్పించిన పుంగనూరు ప్రజలను మరువలేమన్నారు. కొన్ని దుష్ట రాజకీయాల కారణంగా శ్రీనాథరెడ్డికి టికెట్‌ లభించలేదన్నారు. ఈసారైన ప్రతి ఒక్కరు ఉధ్యమించి శ్రీనాథరెడ్డికి టికెట్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరి టికెట్‌ ఇప్పించాలని కోరారు. పుంగనూరు ప్రజల సేవలో ఆహర్నిశలు తమ కుటుంబం పని చేస్తుందన్నారు. శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ తమ కుటుంభాన్ని గల్లి నుంచి ఢిల్లీ వరకు పంపి, మా కుటుంబానికి వివిధ రాజకీయ పదవులు ప్రసాదించిన పుంగనూరు ప్రజల కోసం తాము ప్రాణత్యాగమైన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రత్నమ్మ, సుబ్బరాయప్ప, ఖలీల్‌, బాబు, అబ్బాస్‌, రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags : Punganuru Telugu Ticket to Srinath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *