పుంగనూరు అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన భోజనం, విద్య
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాల్లో ని అంగన్వాడీ కేంద్రాలను పీప్రైమరీ స్కూళ్లుగా ఏర్పాటు చేసి , నాణ్యమైన విద్య, భోజనం అందించడం జరుగుతోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మండలంలోని సింగిరిగుంట గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి , భోజనం చేశారు. మెనుతో పాటు నాణ్యతను పరిశీలించారు. ఎంపీపీ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంగన్ వాడీ కేంద్రాలకు ఎంతో ప్రాముఖ్యత కల్పించిందన్నారు. మెను నిర్ణయించి, పిల్లలకు పోషక పదార్థాలను ఇవ్వడం జరుగుతోందన్నారు. అలాగే ప్రణాళిక బద్దంగా పిల్లలకు బోదనను నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ సిబ్బంధి సహకారం మరువలేనిదని కొనియాడారు. మండలంలోని అంగన్వాడీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజప్ప , వైఎస్సార్సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, నాగరాజారెడ్డి, మోహన్‌రెడ్డి , హరి తదితరులు పాల్గొన్నారు.
Tags; Quality meals and education at Punganur Anganwadi Centers