కరోనా టెస్టుల కోసం క్యూ కడుతున్నారు.

కరీంనగర్ ముచ్చట్లు:
 
నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అనుమానితులు వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. టెస్టులు చేసే పీహెచ్‌సీలకు జనం పోటెత్తుతున్నారు. అయితే వైద్య సిబ్బంది మాత్రం నిర్దేశించిన మేరకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తుండగా, పరీక్షల కోసం జనాల్లో పోటీ నెలకొంది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు తెల్లవారుజామునే క్యూ కడుతున్నారు. అయినా తమ వరకొచ్చే సరికి టెస్ట్ కిట్లు ఐపోతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు నిరంతర పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న వైద్య ఆరోగ్య శాఖ, కేంద్రాల్లో అవసరైన మేరకు టెస్ట్ కిట్లు సరఫరా చేయకపోవడం పట్ల మండిపడుతున్నారు.జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా టెస్టుల ప్రక్రియ కొనసాగుతుండగా, నగరంలో ఆర్టీసీ వర్క్ షాప్, సివిల్ హాస్పిటల్, సప్తగిరి కాలనీ ప్రాంతాల్లోని అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా నగరంలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా, మూడో వేవ్ ప్రారంభమైందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో, జ్వరం, నొప్పులు, దగ్గు, జలుబుతో బాధ పడుతున్న జనాలు టెస్టుల కోసం కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. అలాగే ఒమిక్రాన్ ప్రమాదం కూడా పొంచి ఉందనే ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా సెంటర్ల ఎదుట తీవ్ర రద్దీ ఉంటుందిలో తమకు తెలిసిన వైద్య సిబ్బంది, చోటామోటా నాయకుల ద్వారా టెస్టులు చేయించుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది సిబ్బంది, కేంద్రాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యూలైన్లలో ఉన్న వారిని కాదని, పైరవీలతో వచ్చినవారికి టెస్టులు చేస్తుండటం గొడవలకు దారి తీస్తుంది. రెండు రోజుల క్రితం నగరంలోని సప్తగిరి కాలనీ, సివిల్ హాస్పిటల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి కాకుండా ఇతరులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండటం వివాదానికి దారితీసింది.గంటల తరబడి వేచిఉన్నవారిని కాదని తమ బంధువులకు టెస్టులు చేస్తుండటం పట్ల జనాలు సిబ్బందిపై తిరగబడ్డారు. వ్యాక్సినేషన్ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి సర్ధి చెప్పినా వినకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు స్పందించి స్టోరేజ్ సెంటర్ నుంచి అదనపు టెస్ట్ కిట్లు తెప్పించి పరీక్షలు చేయటంతో ఆందోళన విరమించారు. ఇదంతా చూస్తున్న అనేక మంది ప్రైవేట్ ల్యాబులను ఆశ్రయిస్తున్నారు. దీంతో, వారు అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు టెస్టుల సంఖ్య పెంచి, అవసరమైన మేరకు టెస్ట్ కిట్లు కేంద్రాలకు సరఫరా చేస్తేనే, గొడవలు సద్దుమణిగే అవకాశ ముంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Queuing for corona tests.

Natyam ad