Quintal Rs 5500 crops

క్వింటాల్ రూ.5500  కంది పంట

 Date:11/02/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
అంతర పంటగా సాగు చేసే కంది పంటకు ఈ ఏడాది రైతులు అనుకున్నదాని కంటే మద్దతు ధర లభించింది. క్వింటాలుకు రూ. 5550 ధర నిర్ణయించినట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అందరి ఆశలూ పత్తి పంటపై ఉండటంతో రైతులు కంది సాగుపై దృష్టి సారించలేదు. అయినప్పటికీ రైతులు సాగు చేసిన కొద్దిపాటి పంటకు దిగుబడి ఆశించిన మేరకు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. నిరుటితో పోలిస్తే కంది సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర బాగానే పెరిగింది. నిరుటి కంటే ఈసారి మరో రూ.500 ధర పెరిగినట్లు మార్కెఫెడ్ అధికారులు చెబుతున్నారు. పెట్టుబడి తక్కువగా ఉన్న కంది పంటను రైతులు పత్తి సాగులో అంతర పంటగా వేసి మంచి దిగుబడులు సాధించారు. దానితో జిల్లాలో 8,400 క్వింటాళ్ల కందులను రైతులు నిల్వ చేశారు. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగానే కందులను విక్రయించాలని రైతులు నిర్ణయించుకున్నారు. మరికొంత మంది రైతులు మార్కెట్ యార్డులో ట్రేడర్స్‌కు కందులను మద్దతు ధరలకు విక్రయిస్తున్నారు. పత్తి పంటపై దృష్టి పెట్టిన రైతులు అంతర పంటగా వేసే కంది పంటపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో ఈ ఏడాది కంది పంట సాగు విస్తీర్ణం తగ్గినట్లు అధికారులు భావిస్తున్నారు. దానికి తోడు కౌలు రైతులకు పొలాల కౌలు పెరగడంతో కంది సాగు తగ్గించినట్లు వారు చెబుతున్నారు. ప్రభుత్వం కందుల సాగును ప్రోత్సహించి రైతులకు అండగా నిలిచి నప్పటికీ అనుకోని పరిస్థితుల వల్ల కంది సాగు తగ్గించినట్లు రైతులు చెబుతున్నారు.మరో వారం రోజుల్లో జిల్లా కేంద్రంలో కందులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మార్కెఫెడ్ అధికారులు ఏర్పాటు చేసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్సిస్తూ మార్కెఫెడ్ అధికారులు ఈ ఏడాది పండించిన పంటను మాత్రమే కొనుగోలు చేయనున్నారు. ఇతర వ్యాపారులు నిరుటి పంటను కూడా కొనుగోలు చేయడం వల్ల పాత పంటను రైతులు విక్రయిస్తున్నారు.
Tags: Quintal Rs 5500 crops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *