RadhaSagara program on Visakhapatnam on February 4

ఫిబ్రవరి 4న విశాఖలో నాదశక్తి రాగసాగర కార్యక్రమం

హాజరుకానున్న దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద

Date:11/01/2018

విశాఖపట్నం ముచ్చట్లు:

నాద చికిత్స కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లో మైసూర్‌ అవథూత దత్తపీఠ వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామీజి ‘నాద శక్తి రాగ సాగర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అవధూత దత్తపీఠం (మైసూరు) అఖిలభాతర సేవాసంఘం వ్యవప్థాక అధ్యక్షుడు నారాయణరావు, గణపతి సచ్చిదానంద దత్త జ్ఞానబోధ ట్రస్ట్‌ నిర్వాహకులు ఎం.ఎస్‌.ఆర్‌.కె మూర్తి, ఎం.ఆంజనేయ రాజు, ట్రస్ట్‌ నిర్వాహకులు ఎం.వి.ఆర్‌.వి ప్రసాద్‌ తెలిపారు. బుధవారం ఉదయం ద్వారకానగర్‌ పౌర గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రాచీన నాద చికిత్స విధానంలో రాగ రాగిణీ విద్య తెలిసిర వారిలో స్వామీజీ ఒకరన్నారు. తన గంభీరమైన స్వరంతో స్వామీజీ భజనలు పాడి శ్రోతలను మైమరపింపచేసి వారి బాధలను ఉపశమింపచేస్తారన్నారు. తద్వారా వారి శారీరక, మానసిక అనారోగ్యాలను రూపుమాపడం జరుగుతోందన్నారు. దేశంలోని అనేక వైద్యశాలలు(హిస్పిటల్స్‌) స్వామి సంగీతాన్ని చికిత్సలో భాగంగా వినియోగించడం జరుగుతోందన్నారు. నాద చికిత్సలో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీన సాయంత్రం 4.30 గంటల నుంచి ఉక్కునగరంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. విశాఖ వాసులకు ఇది మంచి అవకాశమని, దీనిలో పాల్గొని తరించాలని కోరారు. పూర్తిసమాచారం, ఉచిత ప్రవేశ సాస్‌ల కోసం 8328008448 నంబరులో సంప్రదించాలని సూచించారు. నూతన సంవత్సరంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ తన తొలి కచేరీని చేయడానికి విశాఖ నగరాన్ని ఎంచుకోవడం మన అదృష్టమన్నారు. ఇటువంటి అరుదైన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సి.పి రామారావు, డాక్టర్‌ భాగ్యారావు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రకృతి శాంతిని కాంక్షిస్తూ ఫ్రిబ్రవరి 3వ తేదీన ఆర్‌.కె బీచ్‌వద్ద లక్ష మంది భక్తులతో హనుమాన్‌ చాలీసా పారాయణ నిర్వహిస్తున్నట్లు గణపతి సచ్చిదానంద దత్త జ్ఞానబోధ ట్రస్ట్‌ నిర్వాహకులు తెలిపారు. ఫ్రిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి బీచ్‌ రోడ్డు కాళీమాత ఆలయం ఎదురుగా సముద్ర తీరంలో ఈ బృహత్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమం మైసూర్‌ అవథూత దత్తపీఠ వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామీజి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతుందన్నారు. లక్షమంది భక్తులతో హనుమాన్‌ చాలీసా పారాయణ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని హనుమంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. నగర ప్రజలు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని చరితార్ధులు కావాలని నిర్వాహకులు కోరారు.

Tags : RadhaSagara program on Visakhapatnam on February 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *