Rahul of Madamaram

మేడారం జాతరకు రాహుల్

Date: 23/12/2017

హైదరాబాద్ముచ్చట్లు: 

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ త్వరలోనే తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశాలున్నా యని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్లో తనను కలసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో టీపీసీసీలోనూ భారీ ప్రక్షా ళన ఉంటుందని చెప్పారు. జనవరి, ఫిబ్రవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు వెల్లడించారు.ఒకవేళ జాతరకు హాజరయ్యే అవకాశం లేకుంటే రాష్ట్రంలో గిరిజనులతో నిర్వహిం చనున్న బహిరంగసభకు ఆహ్వానిస్తామని తెలిపారు. క్రియాశీలంగా పనిచేసే నాయకులకు అవకాశాలు ఉంటాయని ఉత్తమ్ తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో ప్రక్షాళన పూర్తయిందని, జిల్లా, రాష్ట్రస్థాయి పునర్వ్యవస్థీకరణ సం క్రాంతి పండుగ తర్వాత ఉంటుందని చెప్పారు.సంక్రాంతి తర్వాత కాంగ్రెస్లోకి భారీగా, ఊహించని రీతిలో నాయకులు చేరుతారని చెప్పారు. అధికార టీఆర్ ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు చాలామంది చేరుతారన్నారు. మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ పార్టీ మారుతారన్న ప్రచారంపై ప్రశ్నించగా.. వెంటనే దానంతో ఉత్తమ్ ఫోనులో మాట్లాడారు. కాంగ్రెస్ను వీడేది లేదని, తనంటే గిట్టని కొందరు నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని దానం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
టీపీసీసీ మీడియా సలహాదారుగా తిరుమలగిరి టీపీసీసీ మీడియా సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ను నియమిస్తూ ఉత్తమ్ ఉత్తర్వులు జారీ చేశారు. పీసీసీ సాంస్కృతిక సేనకు కన్వీనర్గా ఏపూరి సోమన్నను నియమించారు. పీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా దామోదర్రెడ్డిని నియమించారు.

Tags:rahul gandhi madamaram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *