డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన రాజేంద్రనాథ్ రెడ్డి

అమరావతి ముచ్చట్లు:
 
ఏపీ నూతన డీజీపీగా కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలను తీసుకున్నారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు సీనియర్ ఐపీఎస్
అధికా రులు ఘనంగా వీడ్కోలు పలికారు. రెండు సంవత్సరాలకు పైగా ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ విధులు నిర్వహించారు.1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్
జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్య తలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశా రు.
విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచే శారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో
గుర్తింపు పొందారు.
 
Tags: Rajendranath Reddy took over as DGP

Natyam ad