రాజీవ్ గాంధీ హత్య కేసు.

-నిందితుడు పెరారివాలన్  కు సుప్రీం బెయిల్
న్యూఢిల్లీ ముచ్చట్లు:
తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్ లో జరిగిన  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్ కు  బుధవారం సుప్రీంకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్షను అనుభవిస్తున్న పెరారివాలన్ గత మూడు శతాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.  అయన బెయిల్ విషయలో పలు సార్లు విచారణ జరిపిన తర్వాత ఇవాళ కోర్టు ఆయనకు బెయిల్ను ఇచ్చింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవియాలతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పునిచ్చింది. పెరారివాలన్ 32 ఏళ్ల నుంచి జైలుశిక్షను అనుభవించాడని, అతని ప్రవర్తనపై ఎటువంటి ఫిర్యాదులు లేవని, గతంలో మూడుసార్లు అతన్ని పెరోల్  పై రిలీజ్ చేసినట్లు ధర్మాసనం పేర్కొన్నది. అడిషన్ సాలిసిటర్ జనరల్ నటరాజ్ అభ్యంతరాలు పెట్టినా కోర్టు అతనికి బెయిల్ నిచ్చింది. పెరారివాలన్ 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారని, ఆ కోణంలో ఆయనకు బెయిల్ మంజూరీ చేయాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది.
 
Tags:Rajiv Gandhi assassination case

Natyam ad