మహాశివరాత్రి జాతరకు రాజన్న ఆలయం ముస్తాబు.

వేములవాడ ముచ్చట్లు:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 28 నుండి మార్చి 2 వరకు నిర్వహించే మహాశివరాత్రి  మహోత్సవాల కోసం దేవస్థానం వారు కోటి 80 లక్షల వ్యయంతో వివిధ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.మహా శివరాత్రి ఉత్సవాల్లో దాదాపు మూడు లక్షల పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో వారందరికీ తగిన మౌలిక వసతులను కల్పించడానికి దేవస్థానం వారు ఈవ్యయన్ని ఖర్చు చేయనున్నారు. గుడి చెరువులో చలువ పందిళ్ళు, నీటి వసతి, మరుగుదొడ్ల, క్యూలైన్ల ఏర్పాటు, విద్యుత్ దీపాలతో రాజన్న దేవాలయాన్ని సుందరంగా అలంకరణ,పారిశుద్ధ్యం పనులకోసం తాత్కాలిక సిబ్బంది నియామకం, వైద్య ఆరోగ్య సదుపాయాల కల్పన, తాత్కాలిక  బస్టాండ్ ఏర్పాటు తదితరాల కోసం దేవస్థానం ఈ నిధులను వినియోగించనున్నారు.వీటికి తోడుగా ఈ మహా శివరాత్రిఉత్సవాల్లో అధిక సంఖ్యలో వీఐపీలు పాల్గొనే అవకాశం ఉండటంతో వారందరికీ తగిన వసతి సౌకర్యాలను కల్పించనున్నారు.  స్వామివారిని దర్శించుకున్న భక్తులు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసే
అవకాశం ఉండడంతో నాలుగు లక్షలకు పైగా లడ్డూలను సిద్ధం చేస్తున్నారు ఈ ఉత్సవాల్లో విధులు నిర్వహించడానికి విచ్చేసిన ప్రభుత్వ సిబ్బందికి మూడురోజులపాటు భోజనాలు వేములవాడ దేవస్థానంవారు సమకూరుస్తున్నారు.ఈ ఉత్సవాల కోసం  వస్తే భక్తులకు ప్రస్తుత బస్టాండ్ నుండి దేవస్థానము వరకు ఆర్టీసీవారు ఉచిత బస్సు నడపనున్నట్లు ప్రకటించారు.భక్తులు స్నానం ఆచరించడానికి వివిధస్థలాల్లో నల్లాలను ఏర్పాటు చేశారు.ఈ జాతర కోసం వివిధ ప్రాంతాల నుండి 700 పైగా బస్సులను నడపడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు.మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర సాంస్కృతిక మండలిఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ శివార్చనలో వందలాది కళాకారులు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.దీని కోసం గుడి చెరువుఆవరణలో భారీ వ్యయంతో వేదికను ఏర్పాటు చేస్తున్నారు.అయితే ఇక్కడ కోవిడ్ నిబంధనలను ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.శ్రీ స్వామి వారిని
దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసిన క్యూలైన్లో సైతం భక్తులు భౌతిక దూరం పాటించేట్లుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నప్పటికిని అది ఏ మేరకు అమలు అవుతుందో వేచి చూడాలి.ఈ జాతరలో ఎలాంటిఅవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెండు వేలకు పైగా పోలీసులు బందోబస్తును నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు వీరందరికీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమన్వయం
చేయనున్నారు.భక్తుల ప్రయాణించిన ప్రైవేట్ వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు.
 
Tags:Rajna Temple Mustabu for Mahashivaratri Jatara

Natyam ad