26న మాలమహానాడుచే ర్యాలీ

పుంగనూరు ముచ్చట్లు

పుంగనూరు పట్టణంలో మాలమహానాడు ఆధ్వర్యంలో ఈనెల 26 ఆదివారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా  పట్టణంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌ఆర్‌.అశోక్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హలోమాల చలో పుంగనూరు గోడపత్రికలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే స్థానిక మంజునాథ కళ్యాణ మండపం నందు బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి యనమల సుదర్శనం, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, గుండాలమోహన్‌, జిల్లా కార్యదర్శి చంద్రయ్య, డివిజన్‌ అధ్యక్షుడు మల్లెల మోహన్‌, పట్టణ కన్వీనర్‌ శ్రీనివాసులు, నియోజకవర్గ కన్వీనర్‌ కేశవ, ఎం.రెడ్డెప్ప, విజయ్‌, గంగాధర్‌, వినాయక, కిరణ్‌, మండల కన్వీనర్‌ మంజునాథ్‌, చౌడేపల్లె, పెద్దపంజాణి మండలాల అధ్యక్షులు శివకుమార్‌, మంజునాథ్‌, జిల్లా ప్రచార కార్యదర్శి ఎ.కుమార్‌ పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి మాలసోదరులు, మేదావులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Tag : Rally by Malamahana on 26th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *