Rallying by Malamahaana

మాలమహానాడుచే ర్యాలీ

పుంగనూరు ముచ్చట్లు :

పుంగనూరు పట్టణంలో మాలమహానాడు ఆధ్వర్యంలో ఆదివారం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా పుంగనూరు పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి, అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధులుగా జాతీయ అధ్యక్షుడు వెల్తూరుమల్లయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి యమలా సుదర్శనం, ఆంధప్రదేశ్‌ అధ్యక్షులు జగడం సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్లహసెన్‌ హజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ఎ.సుబ్రమణ్యం, టిఎం. మంజునాథ్‌, శివ, ఎన్‌.మణి, జి.క్రిష్ణమూర్తి, డి.నారాయణ, రామచంద్రయ్య, గుండా మనోహర్‌, మల్లెలమోహన, తిప్పన్న, వినాయక, ఎన్‌.రెడ్డెప్ప, కేశవ, మునిరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Tag : Rallying by Malamahaana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *