Ramakrishna Rao is the 'Necessary'

విశిష్టకథల నిలయం ‘అవసరాల’ రామకృష్ణారావు

Date: 20/12/2017

తెలంగాణ ముచ్చట్లు:

అవసరాల రామకృష్ణారావును రచయితగా కాంటే కూడా మంచి ఆలోచనలు కలిగిన మహోన్నత వ్యక్తిగానే ఆయన సన్నిహితులు గుర్తిస్తుంటారు. దాదాపు కేవలం పదిహేనేళ్ల వయసులో చందమామ కథతో మొదలుపెట్టి 80 ఏళ్ల వయసులో చందమామ కథతోనే జీవితం ముగించిన తెలుగు విశిష్ట కథా రచయిత అవసరాల రామకృష్ణారావు. బాల్యంలో అమ్మ చెప్పిన కథనే ఊకొట్టే భాషలోకి మార్చి ఆయన పంపిన ‘పొట్టిపిచిక’ కథ తొలి చందమామ పత్రికలో 1947 జూలై సంచికలో యధాతథంగా అచ్చయి ఆయన సాహితీ ప్రస్థానానికి తొలి బీజం వేసింది. దాదాపు అరవైనాలుగు సంవత్సరాల తర్వాత ఆయన తన చందమామ జ్ఞాపకాలను పంపుతూ ‘పొట్టిపిచిక’ కథ రూపంలో తన బాల్యంలో తొంగి చూసిన ఆ తొలి కిరణపు రూపురేఖలే తన వృద్ధాప్యంలో కూడా కొనసాగడం మించిన ఆశ్చర్యం, ఆనందం ఇంకేముందని గర్వంగా చెప్పుకున్నారు. అలాంటి కృతజ్ఞత కలిగిన తెలుగు రచయిత బహుశా మరొకరు ఉండరేమో? “ఓ బడుగు జీవి తను కష్టపడి సాధించుకున్నది అది లేషమే ఔగాక, పోగొట్టుకుంటుంది.

Tag:Ramakrishna Rao is the ‘Necessary’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *