బాలికపై రేప్, హత్య: ముగ్గురికి మరణశిక్ష

అహ్మద్నగర్ముచ్చట్లు:
మహారాష్ట్రలో గతేడాది చోటుచేసుకున్న 15ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు దోషులకు మరణశిక్ష పడింది. ఈ కేసులో విచారణ చేపట్టిన అహ్మద్‌నగర్ జిల్లా సెషన్స్ కోర్టు దోషులకు మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది.2016 జులై 13న ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అహ్మద్‌నగర్‌లోని కొపార్డి గ్రామానికి చెందిన 15ఏళ్ల మరాఠా బాలికను ముగ్గురు వ్యక్తులు అపహరించి ఆమెపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను చంపేశారు. బాలిక ఒంటినిండా పంటిగాయాలు ఉండటమేగాక.. కాళ్లూ, చేతులు కూడా విరిగిపోయాయి.ఈ ఘటన అప్పట్లో మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా మరాఠా ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిత్రేంద బాబులాల్ షిండే, సంతోష్ గోరఖ్ భవల్, నితిన్ గోపినాథ్ భాయ్లూమ్ను నిందితులుగా పేర్కొన్నారు. మొత్తం 350 పేజీల ఛార్జ్‌షీటు దాఖలు చేసి కోర్టుకు అందించారు. దీనిపై విచారణ చేపట్టిన అహ్మద్‌నగర్ న్యాయస్థానం.. నవంబర్ 18న ఈ ముగ్గురుని దోషులుగా నిర్ధారించింది. వీరికి మరణశిక్ష విధిస్తూ నేడు తీర్పు వెలువరిచింది.
Tag:Rape and murder: Three death sentences


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *