Rashmi in Deva Das

 దేవ దాస్ లో రష్మిక

Date:17/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
గీతగోవిందం’తో సంచలనం రేపిన నటి రష్మిక తదుపరి సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతోంది. గీతగా ఆకట్టుకున్న ఈ హీరోయిన్ ఈ సారి పూజ గా కనిపించబోతోంది. అది ‘దేవదాస్’ సినిమాలో. నాగార్జున, నాని కాంబోలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీని టీజర్ కూడా విడుదల అయ్యింది. తాజాగా ఈ సినిమా హీరోయిన్ల పరిచయానికి సంబంధించిన స్టిల్స్ విడుదల అయ్యాయి.
రష్మిక ఈ సినిమాలో ‘పూజ’గా కనిపించబోతోందని ఈ స్టిల్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమా ద్వారా ఆకాంక్ష సింగ్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. ఆమె ‘జాహ్నవి’గా కనిపించబోతోందని ఈ లుక్‌తో స్పష్టం అవుతోంది.
ఈ సినిమాలో నాగార్జున ‘దేవ’గా, నాని ‘దాసు’గా కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
Tags:Rashmi in Deva Das

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *