Pawan Kalyan Jana Sena Party Launch

రా… బయటకు ..రా… – ఎన్నికలకు పవన్‌కళ్యాణ్‌ పంచ్‌ – ప్రజలను ఆకట్టుకుంటున్న దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు

హైదరాబాద్‌ ముచ్చట్లు:

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న అజ్ఞాతవాసి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల కోసం జనసేన పార్టీని సమాయత్తం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేశాడు. తొలి విడుతగా బుధవారం (డిసెంబర్ 6న) విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మొత్తం మూడు విడుతలుగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. తన పర్యటన నేపథ్యంలో యువతను తట్టి లేపేందుకు ఓ పాటను రిలీజ్ చేశారు.
గళం విప్పిన పవన్ కల్యాణ్
ప్రజల పక్షాన జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేశంగా గళం విప్పారు. నిరాశ, నిస్పృహలో ఉన్న యువతను ఉత్తేజ పరుచడానికి చలోరే చలోరే.. చల్ అనే పాటను జనసేన పార్టీ విడుదల చేసింది. వింటారా.. వెనకాలే వస్తారా? తోడుగా ఉందాం వస్తారా! రండి విందాం అంటూ దర్శకుడు త్రివిక్రమ్ మాటలతో ప్రారంభమైన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పాట మీకోసం..
మిత్రమా! అసలే చీకటి
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
వింటారా.. వెనకాలే వస్తారా?
తోడుగా ఉందాం వస్తారా!
రండి విందాం
‘మిత్రమా! అసలే చీకటి!
ఇల్లేమో దూరం! దారంతా గోతులు!
చేతిలో దీపం లేదు.
ధైర్యమే ఓ కవచం’
కలల ఖనిజాలతో చేసిన యువత
ఒక దేశ సంపద ఖనిజాలు కాదు..
నదులు కాదు..
అరణ్యాలు కాదు.
కలల ఖనిజాలతో చేసిన యువత
వారే భవిష్యత్‌కు నావికులు
పర్వతం ఒకరికి వొంగి సలాం చేయదు
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే చాల్ల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వారికి ఇదే చెబుదాం
సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు.
తుఫాన్ గొంతు చిత్తం అనడం ఎరుగదు
పర్వతం ఒకరికి వొంగి సలాం చేయదు.
నేను పిడికిలిలో పట్టేంత మట్టే కావోచ్చు
కాని గొంతెత్తితే ఓ దేశపు జెండాకు ఉన్న పొగరు ఉంది
ఓటు అనే బోటు మీద సముద్రం
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
ఏం.. రా..
ప్రజల ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకు
మనం చెప్పదలచుకొన్నది ఒకటే
దేశం మాకు గాయాలు ఇచ్చినా,
మేము మీకు పూలనే ఇస్తున్నాం
ఓ ఆశ చంద్రికల కుంభవృష్టి
యోచించు మిత్రమా మాకోసం ఏమి తెస్తావో
మా అందరి కోసం ఓటు అనే బోటు మీద సముద్రమే దాటావు
మరవకు మిత్రమా.. మరవకు
లోక బాంధవుడు అసలే లేకుండా
ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛలోరే ఛలోరే ఛల్ ఛల్
మన హక్కుల కోసం పోరాడే ప్రజల రెక్కలు విరిచే
ప్రతి ప్రభుత్వానికి ఇదే మన మాట
రాహువు పట్టిన పట్టు ఒక సెకను అయినా
లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా
నరజాతి ప్రస్థానం పరిసమాప్త
మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనీయకుండా పోతే
ఖరాఖండం అంతటి అంతమైపోతుందా
పాలకుల కూటమికొక త్రుటికాలం జయమొస్తే
విశ్వసృష్టి పరిణామం విచ్చిన్నమవుతుందా?
దనుజలోక మేకంగా దారినడ్డు నిల్చుంటే
నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా?
ఏం..
రా..
బయటికి రా..
Tags : Pawan Kalyan Jana Sena Party Launch

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *