పేటీఎంకు ఆర్బీఐ షాక్
ముంబై ముచ్చట్లు:
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేదం విధించింది. పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. పేటీఎం ఐటీ సిస్టమ్‌పై పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపేందుకు సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం ఆర్బీఐ మంజూరు చేసే అనుమతికి లోబడి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు 2015లో ఏర్పాటైంది. పేమెంట్స్ బ్యాంక్ నడిపేందుకు ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత 2017 నవంబర్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి.
Tags: RBI shocks PTM