RBI's first governor in Independence India

స్వాతంత్య్ర భారతంలో ఆర్బీఐ తొలి గవర్నర్‌

-అలనాడే ఆర్ధిక సంస్కరణలకు దేశ్‌ముఖ్‌ శ్రీకారం

-ప్రపంచ ద్రవ్య మార్పిడి పరిణామాలపై పరిశోధన?

Date: 14/01/2018

ముంబయి ముచ్చట్లు:

జనవరి 13: 1896 జనవరి 14న జన్మించిన సి.డి.దేశ్‌ముఖ్‌ పూర్తి పేరు చింతామణి ద్వారకానాథ్‌ దేశ్‌ముఖ్‌. ఈయన భారతీయ రిజర్వ్‌ బాంక్‌ మూడవ గవర్నర్‌, స్వతంత్ర భారతదేశపు తొలి రిజర్వ్‌ బాంక్‌ గవర్నర్‌. ఇతడు 1943 ఆగస్టు 11 నుంచి 1949 జూన్‌ 30 వరకు ఈ పదవిని నిర్వహించాడు. ఆ తర్వాత దేశ్‌మూఖ్‌ భారత దేశానికి ఆర్థిక మంత్రిగా నియమితులైనాడు. 1920లో రోసినా ఆర్థర్‌ విల్కాక్స్‌ అనే ఆంగ్ల వనితను వివాహమాడాడు. 1949లో తొలి భార్య మరణించింది. వీరి కుమార్తె ప్రిమ్‌రోజ్‌ ఇంగ్లాండులో నివసిస్తుంది. ఆ తరువాత 1953లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలైన దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ సభ్యుడైన దేశ్‌ముఖ్‌కు 1939 నుంచే రిజర్వ్‌ బ్యాంక్‌తో సంబంధం ఉంది. 1941లో రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌గా నియమించబడ్డాడు. 1943 ఆగస్టు ఆ తర్వాత జేమ్స్‌ టేలర్‌ నుంచి 3వ గవర్నర్‌గా బాధ్యతలు పొందినాడు. దేశ్‌ముఖ్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో ప్రపంచంలో ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు సంభవించాయి. జూలై 1944లో జరిగిన బ్రెట్టన్‌ వుడ్స్‌ సమావేశంలో అతడు కూడా భారతదేశం తరఫునన పాల్గొన్నాడు. ఈ సమావేశమే అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు ఏర్పడడానికి కారణమైంది. ఈ రెండు సంస్థలలోనూ దేశ్‌ముఖ్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్‌గా పదేళ్ళ పాటు పనిచేశాడు. 1950లో పారిస్‌లో జరిగిన ఈ రెండు సంస్థల వార్షిక సంయుక్త సమావేశంలో ఇతడు చైర్మెన్‌గా వ్యవహరించాడు. 1952లో దేశ్‌ముఖ్‌ విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయపు జేసస్‌ కళాశాల నుంచి గౌరవ ఫెలోగా ఎన్నికయ్యడు. 1959లో ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్‌ మెగ్సేసే అవార్డును పిలిప్పీన్స్‌కు చెందిన జోస్‌ అగ్విలార్‌తో కల్సి సంయుక్తంగా పొందాడు. 1975లో భారత ప్రభుత్వంచే పద్మ విభూషణ పురస్కారం పొందినాడు.

Tags: RBI’s first governor in Independence India

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *