గులాబీ గూటికి చేరేదేలె.

మెదక్ ముచ్చట్లు:
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీనామా, కొత్త పార్టీ అనే చర్చ ఈ రోజు లేదని… మీ అందరి ఆలోచన ఏంటో తనకు తెలుసు అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు టీఆర్ఎస్‌లోకి వెళ్లే ఉద్దేశం లేదని.. బీజేపీలోకి వెళ్లే మాటే లేదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలతో ఆయన అన్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే తనతో ఎంతమంది వస్తారని ఆయన అడిగారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కాంగ్రెస్ నాయకులు కోరినట్లు జగ్గారెడ్డి మీడియాతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే జగ్గారెడ్డి వెంట ఉంటామని పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మధు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.2018లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వరుసగా ఎన్నికలు వచ్చాయి… తర్వాత కరోనాతో.. 20 నెలల పాటు పార్టీ కార్యకర్తలను కలవలేని పరిస్థితి వచ్చిందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ రెండేళ్లు తనకు చేతనైన సాయం చేశానని పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీతో మాట్లాడిన తర్వాతే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి వెల్లడించారు. సోనియా, రాహుల్ గాంధీలను కలిసిన తర్వాత సానుకూల నిర్ణయం రావాలని దేవుడిని కోరుకుంటున్నానని.. ఒకవేళ పాజిటివ్ నిర్ణయం రాకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానని తెలిపారు. తాను బయటకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నానో పార్టీలో చాలామందికి తెలుసన్నారు. తన వెంట నాయకులు రాకుంటే ఊరికి పది మంది డప్పుల వాళ్ళను పట్టుకుంటానని.. జగ్గారెడ్డికి ఊర్లో కార్యకర్త అంటూ ఎవరు లేరని.. జగ్గారెడ్డి వస్తుండు అని డప్పు చాటింపు వేయిస్తానని.. అప్పుడు కనీసం 50 మంది అయినా తనతో రారా అంటూ ప్రశ్నించారు.
 
Tags:Reaching the pink gooey

Natyam ad